Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో ఆసుపత్రుల వెలుపల సంరక్షణ విభాగంలో గుర్తింపు ఉన్న హెల్త్ టెక్ కంపెనీ హెచ్‌సిఎహెచ్ (గతంలో హెల్త్ కేర్ అట్‌హోమ్), భారతదేశంలో అతిపెద్ద జీరియాట్రిక్-సెంట్రల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సీనియారిటీని స్వాధీనపరుచుకుంటున్నట్లు నేడు ప్రకటించింది. దీనితో, హెచ్‌సిఏహెచ్ (నజAన) తన ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ సేవలను కొత్త కంపెనీతో ఏకీకృతం చేస్తూ, వృద్ధులకు సంపూర్ణ శ్రేయస్సు, అవసరాల కోసం ఎండ్-టు-ఎండ్ సీనియర్ కేర్ సేవలను, జీరియాట్రిక్- సెంట్రల్ సేవలను మరింత మెరుగుపరచాలని యోచిస్తోంది. ఆర్పిజి గ్రూపు యాజమాన్యంలోని సీనియారిటీ భారతదేశంలో అతిపెద్ద వృద్ధాప్య-కేంద్రీకృత డిజిటల్ ప్లాట్‌ఫారాన్ని నిర్వహిస్తోంది. ఇది సీనియర్ సిటిజన్ల కోసం వైద్యం నుంచి లైఫ్ స్టైల్ వరకు 20,000 ఉత్పత్తుల క్యూరేటెడ్ పోర్ట్‌ఫోలియోను నేరుగా వినియోగదారులకు విక్రయిస్తోంది. పూణె మరియు చెన్నైలలో రెండు ఆఫ్‌లైన్ స్టోర్లను కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం, భారతదేశంలో 70 ఏళ్ల సగటు వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు 150 మిలియన్లకు పైగా ఉన్నారు. అలాగే 2025 నాటికి, భారతదేశంలోని జనాభాలో 12% మంది 60 ఏళ్ల వయస్సులో ఉంటారు మరియు 2050 నాటికి వృద్ధుల జనాభా నాటికి 280 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ గణాంకాలు ఈ రంగంలో డిమాండ్‌ను వృద్ధి చేయనుంది. ఈ విభాగాన్ని గతంలో సమ్మిళిత వినియోగదారుల సమూహంగా పరిగణించబడనప్పటికీ, తాజా పోకడల ప్రకారం ఇప్పటి తరం వృద్ధులకు సౌకర్యాల ఆకాంక్షలు మరియు అంచనాలు, మెరుగైన జీవన ప్రమాణాలు మరియు అధునాతన వయస్సులో వారు కోరుకున్న జీవనశైలికి చెల్లించే సామర్థ్యంతో అనుకూలీకరించిన సేవలను కోరుకుంటున్నారని పలు సమీక్షలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే తరాల సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా, స్వతంత్రంగా ఉండాలనే బలమైన కోరికతో మెరుగైన జీవనశైలి మరియు ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. హెచ్‌సిఏహెచ్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, 'భారతదేశంలో వృద్ధాప్య విభాగంలో మా పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది హెచ్‌సిఏహెచ్ తన ఉనికిని మెరుగుపరచుకుంటూ, వినియోగదారుల సంఖ్యను విస్తరించుకునేందుకు వృద్ధుల సంరక్షణ విభాగంలో అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించుకునేందుకు అవకాశాన్ని అందిస్తుంది. ప్రస్తుతం, మా వినియోగదారులలో 60% మంది వృద్ధులు ఉండగా, వారికి మేము రిహాబ్, ఐసియు, నర్సింగ్, కేర్‌గివర్, కన్సల్టేషన్, ల్యాబ్ మరియు పరికరాల సేవలను ఇంట్లో, డిజిటల్‌గా మరియు మా పరివర్తన సంరక్షణ కేంద్రాలలో అందిస్తున్నాము. సీనియారిటీని సొంతం చేసుకోవడం ద్వారా, వృద్ధులకు కావలసిన అన్ని అవసరాలను పరిష్కరించడం, వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభాకు వన్ స్టాప్ షాప్ సేవలు అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. వృద్ధుల మార్కెట్లలో వృద్ధి అనేది రాబోయే అనేక దశాబ్దాల పాటు కొనసాగే లౌకిక ధోరణి అని మేము విశ్వసిస్తున్నాము. డిజిటల్ వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో పాటు, మా ఫిజిటల్ వ్యూహంలో భాగంగా, మేము స్వతంత్ర ప్రాతిపదికన, అలాగే మా పరివర్తన సంరక్షణ కేంద్రాలలో కొత్త సీనియారిటీ స్టోర్లను కూడా ప్రారంభిస్తాము. వృద్ధుల మార్కెట్లో మా ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు భవిష్యత్తులో అసిస్టెడ్ లివింగ్, వృద్ధుల డే కేర్ మరియు వృద్ధుల దగ్గర ఉండి చూసుకునే కొత్త సేవలను మేము ప్రారంభిస్తాముు అని వివరించారు. సీనియారిటీ వ్యవస్థాపకుడు తపన్ మిశ్రా మాట్లాడుతూ, నిఇది ఎండ్-టు-ఎండ్ హెల్త్‌కేర్, లైఫ్‌స్టైల్ మరియు లైఫ్ అసిస్టెడ్ సేవలను అందించేందుకు భారతదేశంలోని వృద్ధాప్య సంరక్షణ విభాగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితి వృద్ధుల అవసరాన్ని బట్టి ఆరోగ్య సంరక్షణ సేవలను కోరుతోంది మరియు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి/బలోపేతం చేసేందుకు హెచ్‌సీఏహెచ్ అత్యుత్తమ సంస్థ అని మేము విశ్వసిస్తున్నాము. హెచ్‌సిఎహెచ్ గొడుగకు కింద సీనియారిటీ అభివృద్ధి చెందుతూ, మరింత ఎత్తుకు చేరుకుంటుంది్ణ్ణ అని ధీమా వ్యక్తం చేశారు