Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆరోగ్య సేవలను అగ్రగామిగా అందిస్తున్న ప్రిస్టిన్ కేర్ తన విస్తరణకు ప్రణాళిక రూపొందించుకోగా, 2023 చివరికి దక్షిణ భారతదేశంలో 300 ఆసుపత్రులు మరియు 100 క్లినిక్‌లను చేర్చుకోనుంది.ఈ విస్తరణతో తన నెట్వర్కులో ఆసుపత్రులను 500కు మరియు క్లినిక్‌లను 150కు పెంచుకోనుంది. ప్రస్తుతం ప్రిస్టిన్ కేర్ శస్త్ర చికిత్స కేంద్రాలు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ టైయర్ 1 మరియు టైయర్ 2 నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చి, మధురై, కోయంబత్తూరు, కోజికోడ్, విజయవాడ మరియు విశాఖపట్నాలలో ఉన్నాయి. సాధారణ శస్త్రచికిత్స, ఆప్తమాలజీ, ఇఎన్‌టి, యూరాలజీ, గైనకాలజీ తదితర 12 శస్త్రచికిత్సల విభాగాల్లో కంపెనీ పని చేస్తుండగా, దంత వైద్య విభాగానికి తన సేవలను విస్తరించే ఆలోచనను కలిగి ఉంది.
విస్తరణ గురించి ప్రిస్టిన్ కేర్ సహ-వ్యవస్థాపకుడు హర్సిమర్బిర్ సింగ్ మాట్లాడుతూ, ‘‘ఆరోగ్య సేవల వ్యవస్థలో లోతుగా చేరుకునేందుకు మరియు దేశ వ్యాప్తంగా మా ఉనికిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం మాకు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 200 భాగస్వామ్య ఆసుపత్రులు మరియు 50+ క్లినిక్‌లు ఉన్నాయి. ఈ విస్తరణతో మేము నా పరిధిని టైయర్ 2 మరియు 3 పట్టణాలకు విస్తరించే ప్రణాళికలను కలిగి ఉన్నాము. మేము స్థిరమైన నాణ్యత మరియు మెరుగైన సర్జికల్ కేర్‌ను అందించే మరియు ఆరోగ్య సేవల్లో సరికొత్తదాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు తోడ్కొనవ వెళ్లే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము’’ అని వివరించారు. ప్రిస్టిన్ కేర్ గత 2 ఏళ్లలో అపారమైన వృద్ధిని సాధించింది. ఇది ఇటీవల రతన్‌టాటా మద్దతు ఇస్తున్న హెల్త్-టెక్ ప్లాట్ఫారం లైబ్రేట్ను స్వాధీనపరుచుకుని ప్రాథమిక ఆరోగ్య సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. కంపెనీ తన సర్జికల్ కేంద్రాలను 800కు రెట్టింపు చేసుకుంది మరియు 1.55ఇ మిలియన్+ రోగులతో కమ్యూనికేషన్ చేసి 100కె రోగులకు చికిత్స అందించింది. ఆరోగ్య సంరక్షణను అందిస్తున్న సంస్థల్లో రెండవ అత్యంత ఎక్కువ సంఖ్యశస్త్ర చికిత్సలు అని చెప్పవచ్చు.