Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్రేక్‌ఫాస్ట్ అయింది. లంచ్ కూడా తినేశాం. ఆ తరువాతే అసలు సందేహం బయలు దేరుతుంది. డిన్నర్‌కు చాలా సమయం ఉంది. కానీ ఆకలి మాత్రం వేస్తోంది. ఏం తినాలి ? సాయంత్రం 5 అయిందంటే చాలామందిలో మెదిలే ప్రశ్న ఇది. పిల్లలు స్కూల్ లేదంటే కాలేజీ నుంచి ఇంటికి తిరిగివచ్చే సమయం. ఉద్యోగం అయితే అందరూ ఆఫీసులు వదిలే సమయం. హాస్టల్స్ వద్ద, ఆకలి అనేది మనతో పాటే కలిసి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా... ఆకలి మాత్రం వేస్తూనే ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఏ సమయంలో అయినా అంటే ఉదయం 11 గంటలు అయినా సాయంత్రం 5 గంటలు అయినా లేదంటే అర్ధరాత్రి అయినా సరే ఆహారం మాత్రం లభ్యమవుతూనే ఉంటుంది. ఫుడీ, సాహసోపేత ట్రావెలర్ అరుణ ప్రియ భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాలలో సైతం లభ్యమయ్యే ఈ తరహా విభిన్న వంటకాలను గురించి చెప్పారు. అవేమిటంటే...
1. ఖాక్రా
గుజరాత్లో పుట్టి ఉండవచ్చు కానీ అహ్మదాబాద్ మొదలు లాస్ ఏంజెల్స్, బెర్లిన్, మాల్దీవులలో అధికంగా కనిపించే స్నాక్ ఇది. ఈ క్రంా, ఫ్లాకీ రుచులలో ఆనందం కలిగించే అంశం గోధుమపిండి, బీన్, నూనె. ఇప్పుడు కోరుకున్న రుచులు దీనిలో లభ్యమవుతున్నాయి.
2. సేవ్
భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ సేవ్ కనిపిస్తుంది. ఇది వైవిధ్యమైన స్నాక్. ఇంటిలో కూడా అతి సులభంగా చేయదగిన వంటకం మాత్రమే కాదు ప్రయోగాలూ చేయవచ్చు. దీనిలో శెనగపిండి, తమ రుచికి తగ్గట్లు జీలకర్ర, కారం, వాము వంటివి జోడిస్తే చాలు.
3. పాపడ్స్
పప్పు, అన్నం, ఓ స్పూన్ పచ్చడి తో పాటు పాపడ్. అంతకు మించిన ఆనందం ఏముంటుంది ? ఎలాంటి పిండితో అయినా పాపడ్ చేసుకోవచ్చు. వేసవిలో ఈ పాపడ్స్ చేసుకుని నిల్వ చేసుకుంటే మిగిలిన రోజుల్లో వాడుకోవచ్చు. ఇక ఇటీవలి కాలంలో వీటిలోనూ ఎన్నో రుచులు అందుబాటులోకి వచ్చాయి. కాస్త నూనెలో వేయిస్తే చాలు... మనం కోరుకునే స్నాక్ సిద్ధం
4. చిప్స్ మరియు పకోరా
మన మనసుకు నచ్చిన విధంగా అరటి, పనస, బంగాళాదుంప , కాలిఫ్లవర్, పన్నీర్ , ఎలాగైనా చిప్స్ చేసుకోవచ్చు. శెనగపిండి, జీర, పసుపు, కారం, గరం మసాలా, వాము లాంటివి జోడిస్తే ఇంకాస్త రుచిగా ఇది ఉంటుంది.
గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ‘‘స్నాక్స్‌లో ఉన్న గొప్పతనం ఏమిటంటే, వాసనలేని, స్వచ్ఛమైన నూనెలో తయారుచేసిన స్నాక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటుగా రుచికరంగా ఉంటాయి. దశాబ్దాలుగా గోల్డ్‌డ్రాప్ ఈ భరోసా అందిస్తుంది’’ అని అన్నారు.