Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్‌కు 1,181 పాయింట్ల లాభం
ముంబయి : కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో సాగాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాల మద్దతుతో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,181 పాయింట్లు పెరిగి 61,795కు చేరింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 321 పాయింట్లు రాణించి 18,349 వద్ద ముగిసింది. ఉదయం నుంచి మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 52 వారాల గరిష్ఠానికి చేరాయి. బీఎస్ఈలో ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.3.6 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. వరుసగా నాలుగో నెలా అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో అక్కడి మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇది భారత మార్కెట్లలోనూ విశ్వాసం నింపింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక్క శాతం పెరగడం సూచీలకు కలిసి వచ్చింది. ఎఫ్ఐఐల కొనుగోళ్లు పెరిగాయి.