Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్‌ఫ్రాంక్ రిపోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో రియాల్టీ అమ్మకాల్లో పతనం చోటు చేసుకుంది. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో నివాస గృహాల అమ్మకాలు 18 శాతం పడిపోయి 4,597 యూనిట్లుగా నమోదయ్యాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 5,633 యూనిట్ల విక్రయాలు జరిగాయని పేర్కొంది. విలువ పరంగా గత నెలలో రూ.2,237 కోట్ల ఆస్తులు రిజిస్ట్రర్ అయ్యాయి. గతేడాది ఇదే నెలలో రూ.2,468 కోట్ల అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను పరిగణనలోకి తీసుకుని నైట్‌ఫ్రాంక్ ఈ రిపోర్టును రూపొందించింది.