Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో తమ వినియోగదారులకు బ్లూటిక్ ఫీచర్ కోసం రూ.719 (8.91 డాలర్లు) ఛార్జ్ చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది. ఈ విషయమై ట్విటర్ నుంచి వినియోగదా రులకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. నవంబర్ 10 నుంచి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను వసూలు చేయడం ప్రారంభించినట్లు రిపోర్టులు వచ్చాయి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చునని ట్విటర్ తెలిపింది. అయితే ప్రస్తుతానిపై ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను వర్తింపజేయనున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా ఈ చార్జీల్లో మార్పులు చేస్తున్నట్లు గతంలో ఎలన్ మస్క్ తెలిపారు.