Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలలో ఒకటైన కెనరా రోబెకో మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సూచీల్లో ప్రధానంగా పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ ఈక్విటీ స్కీమ్ అయిన కెనరా రోబెకో మిడ్ క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ ఫండ్‌ను నవంబర్ 11న తెరవగా.. ఈ నెల 25న మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ నిధులను నైతికత, బలమైన వద్ధి ఆధారిత వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం, సమర్థ నిర్వహణ, సహేతుకమైన వాల్యుయేషన్‌తో మిడ్‌క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ సంస్థ ఎండి, సిఇఒ రజనీష్ నరులా తెలిపారు.