Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో పిట్టీ ఇంజనీరింగ్ నికర లాభాలు 22 శాతం తగ్గి రూ.10.15 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ2లో కంపెనీ నిర్వహణ రెవెన్యూ 25.57 శాతం పెరిగి రూ.304.17 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.242.23 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ సామర్థ్య వినియోగం 71.29 శాతంగా నమోదయ్యిందని తెలిపింది. 2022 సెప్టెంబర్ 30 నాటికి ఆర్డర్ బుక్ రూ.881 కోట్లుగా ఉందని ఆ కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండి అక్షరు పిట్టీ పేర్కొన్నారు.