Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ ఇండియా ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ కంపెనీ తొలి విద్యుత్ కారు కోనా ఎలక్ట్రిక్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.35 వేలు, సిఎన్జి వేరియంట్ కారుపై రూ.25 వేలు తగ్గింపును ఇస్తున్నట్లు పేర్కొంది. ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 వరకు లభించనుందని పేర్కొంది. ఈ వాహనాలపై గరిష్టంగా రూ.48 వేల వరకు డిస్కౌంట్లు పొందవచ్చని తెలిపింది. నవంబర్ చివరి వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.