Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 13 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1.92 కోట్ల నష్టాలు చవి చూసింది. కాగా.. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.7.5 కోట్ల లాభాలు ప్రకటించింది. క్రితం క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాదికేడాదితో పోల్చితే 19.5 శాతం పెరిగి రూ.175.9 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 10.21 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గాయి.