Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో: ట్విట్టర్లో చెల్లిం పుల సర్వీసు అయినా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ను నిలిపివేసినట్లు తెలుస్తోం ది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ నమోదు ఆప్షన్ కనిపించట్లేదని అంతర్జాతీయ ఆంగ్ల మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వల్ల నకిలీ ఖాతాలు ఎక్కువగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును ఆపేసినట్లు సమాచారం. ఈ సర్వీసును పొందాలనుకునే వారికి 8 డాలర్లు ఛార్జ్ చేయాలని ట్విట్టర్ చీఫ్ ఎలన్ మస్క్ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి భారత్‌లోనూ ఈ సర్వీసులను అందు బాటులోకి తెచ్చింది. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి వాటికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారని ట్విట్టర్ దృష్టికి రావడంతో సబ్‌స్క్రిప్షన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.