Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి రూ.4.6 లక్షల కోట్లు అవసరం
- ప్రపంచ బ్యాంక్ అంచనా
న్యూఢిల్లీ : భారత్లోని పట్టణాల అభివృద్థికి వచ్చే 15 ఏళ్లలో 840 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.70 లక్షల కోట్లు ) పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు మౌలిక వసతులు కల్పించడానికి ఏడాదికి సగటున 55 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.6 లక్షల కోట్లు) వ్యయం చేయాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి)లో మౌలిక వసతుల కల్పనకు సరైన సమయని పేర్కొంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థల బాడీలు సహా కేంద్ర ప్రభుత్వంలోని స్మార్ట్ సిటీలు, ప్రధాన మంత్రి ఆవాస యోజన (పిఎంఎవై) లాంటి అర్బన్ మిషన్ విభాగాలు ప్రగతిలో నెమ్మదత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ప్రపంచ బ్యాంక్ తన ఒక రిపోర్టులో పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ఉండాల్సిన పటు టారీఫ్ ఛార్జీల కంటే తక్కువగా ఉన్నాయని.. దీంతో రెవెన్యూ తగ్గుతుందని తెలిపింది. 2036 నాటికి భారత్లోని పట్టణాల్లో 60 కోట్ల మంది ప్రజలు నివసించవచ్చని అంచనా వేసింది. ఇప్పుడున్న జనాభాకు మరో 40 శాతం మంది చేరడంతో అదనపు ఒత్తిడి నెలకొననుందని విశ్లేషించింది.