Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మెటాలో భాగమైన వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తన పదవికి రాజీనామా చేశారని ఆ సంస్థ వెల్లడించింది. అదే విధంగా మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా తప్పుకున్నా రని తెలిపింది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేసిన కొద్ది రోజులకే ఈ ఇద్దరూ రాజీనామా చేయడం గమనార్హం. వారం రోజుల క్రితం మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థలో పని చేస్తున్న వారిలో దాదాపు 13 శాతం అంటే 11,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోస్ రాజీనామా చేశారా..? లేదా కంపెనీనే తొలగించిందా అనేది పరిశ్రమ వర్గాల్లో అనుమానాలకు దారీ తీస్తుంది. వాట్సాప్‌లో యుపిఐ పేమెంట్స్‌తో పాటు, ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ డిజైన్, విస్తృతం చేయడంలో బోస్ పాత్ర కీలకంగా ఉంది. వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా ఎనలేని సేవలు అందించిన అభిజిత్‌కు ధన్యవాదాలని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్ కార్ట్ పేర్కొన్నారు.