Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియాకు అమెరికన్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. కరోనా కాలంలో రద్దయిన విమానాల కు సంబంధించిన టికెట్ రీఫండ్లను చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ప్రయాణికులకు 121.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.983కోట్లు) రీఫండ్లతో సహా.. చెల్లింపు ఆలస్యానికి గానూ 1.4 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.11.33కోట్లు) జరిమానా విధిస్తూ అమెరికా రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. యుఎస్‌లో విమానయాన కంపెనీలు అర్థంతరంగా విమానాలను రద్దు చేయడం, సమయాల్లో మార్పులు చేసినప్పుడు ప్రయాణికులు కోరిన విధంగా రిఫండ్ చేయాల్సి ఉంటుంది.