Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగుమతులు 17 శాతం పతనం
న్యూఢిల్లీ: భారత వాణిజ్య లోటు ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఎగుమతులు భారీగా పడిపోవడం, దిగుమతులు తగ్గ డంతో లోటు ఎగిసి పడుతోంది. 2022 అక్టోబర్లో సరుకుల ఎగుమతులు 16.65 శాతం పతనమై 29.75 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గతేడాది ఇదే మాసంలో 35.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు చోటు చేసుకున్నాయి. గడిచిన నెలలో దిగుమతులు 5.7 శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఎగుమతులు తగ్గి.. దిగుమతులు పెరగడంతో గడిచిన నెలలో భారత వాణిజ్య లోటు 26.91 బిలియన్ డాలర్లకు ఎగిసింది. భారత కరెన్సీలో ఇది రూ.2.17 లక్షల కోట్లకు సమానం. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత పారిశ్రామిక విధానం ఎగుమతులను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా.. దిగుమతులు 33.12 శాతం ఎగిసి 436.81 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. దీంతో గడిచిన ఏడు మాసాల్లో వాణిజ్య లోటు దాదాపు రెట్టింపై 173.46 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.14 లక్షల కోట్లు)గా నమోదయ్యింది.