Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో వినియోగ దారులకు అందిస్తున్న డిస్నీ, హాట్‌స్టార్ ప్లాన్లను పూర్తిగా తొలగించింది. ఈ ఒటిటిలోని కొన్ని ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను గడిచిన అక్టోబర్‌లోనే తొలగించింది. తాజాగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రూ.1499, రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తివేసింది. ఈ ప్లాన్లు జియో సహా పేటియం, అమెజాన్ పే, ఫోన్ పే లాంటి థర్డ్ పార్టీ పోర్టల్లోనూ కనుమరుగయ్యాయి. ఇప్పటి వరకు ఐపిల్ ప్రసారాలు చేస్తున్న డిస్నీ, హాట్‌స్టార్ ఆ హక్కులను కోల్పోగా.. 2023 నుంచి రిలయన్స్ గ్రూపులో భాగమైన వయాకమ్ 18 ఆ ప్రసార హక్కులను పొందింది. దీంతో డిస్నీ, హాట్‌స్టార్ ప్లాన్లను జియో తొలగించిందని పరిశ్రమ భావిస్తున్నాయి.