Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్లకు ఎల్ఐసీ ఆహ్వానం
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ కాపిటల్ లిమిటెడ్ (ఆర్సీఎల్)కు చెందిన ఆస్తులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)కి విక్రయించాలని ఎల్ఐసీ నిర్ణయిం చింది. ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వక పోవడంతో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ఈ నిర్ణయం తీసుకుంది. తనఖాగా పెట్టుకుని అప్పులిచ్చిన ఆర్సిఎల్, ఆ సంస్థ సబ్సీడరీలను స్వాధీనం చేసుకుంది. కాగా.. వీటిని ఏఆర్సీలకు విక్రయించాలని నిర్ణయించింది. వీటి బిడ్డింగ్‌కు నవంబర్ 28 చివరి రోజుగా ప్రకటించింది. ఆ ఆస్తుల అమ్మకానికి ఏఆర్‌సీల నుంచి బిడ్లను అహ్వానిస్తున్నట్టు తెలిపింది. ఆర్‌సీఎల్‌లో ఎనిమిది వ్యాపారాలున్నాయి. ఇందులో సాధారణ బీమా, జీవిత బీమా, వైద్య బీమా, సెక్యూరిటీ బిజినెసెస్, అసెట్ రీకన్స్ట్రక్షన్ తదితర వ్యాపారాలు ఉన్నాయి.