Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జిప్రోక్ మెటల్ ఛానల్స్‌ను నకిలీ చేయడం పట్ల హైదరాబాద్‌లోని రాచకొండ పరిధిలో ఉన్న మారుతీ ట్రేడర్స్‌పై ఐపీసీ సెక్షన్ 420 మరియు ట్రేడ్‌మార్క్ చట్టం సెక్షన్ 103, 104 కింద హైదరాబాద్ పోలీస్ ఓ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. ఈ ఎఫ్ఐఆర్ను సెయింట్ –గోబిన్ జిప్రోక్ ఇండియా ఐపీఆర్‌ను అక్రమంగా వినియోగించడం మరియు నకిలీ జిప్రోక్ ఉత్పత్తుల విక్రయం గురించి నమోదుచేశారు.
సెయింట్ గోబిన్ జిప్రోక్ యొక్క ఫిర్యాదును అందుకున్న తరువాత పోలీసులు, ఈ మోసపూరిత సంస్థ ప్రాంగణంపై దాడి చేసి నేర దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడులలో కనుగొనబడిన మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. మరిన్ని వివరాలను పోలీసులు త్వరలోనే వెల్లడించనున్నారు.