Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : క్యాన్సర్ రోగులకు అత్యాధునిక చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా వారికి చేరువలో ఆ సేవలను అందించడమే లక్ష్యంగా క్యాన్సర్ చికిత్స కోసం తిరుపతిని అతి ప్రధానమైన కేంద్రంగా నిలుపడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ దిశగా అతి ప్రధానమైన ముందడుగు వేస్తూ , అత్యాధునిక క్యాన్సర్ కేర్ కేంద్రంగా బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (బీఐఓ)ను ప్రారంభించింది. ఇక్కడ జెనోమిక్స్, వ్యక్తిగత సంరక్షణ లక్ష్యిత చికిత్సలు అందిస్తారు. బీఐఓలో విస్తృత శ్రేణిలో నివారణ, సర్జికల్, వైద్య, రేడియేషన్ ఆంకాలజీ సేవలను అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ చికిత్స సదుపాయాలతో బీఐఓ అనుసంధానించబడటంతో పాటుగా సమగ్రమైన, అత్యాధునిక చికిత్స అవకాశాలను రోగులకు చేరువచేస్తుంది. అదనంగా, క్యాన్సర్ చికిత్సలో పల్లియేటివ్ కేర్ ఆవశ్యకతను గుర్తించి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్వీఐఎంఎస్) ఓ షౌండేషన్ కోర్సును పల్లియేటివ్ కేర్‌ను పల్లియం ఇండియా భాగస్వామ్యంతో రాబోయే నెలలో ప్రారంభించనున్నారు. ప్రారంభంలో 30 పడకలతో పల్లియేటివ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ‘‘భారతదేశంలో క్యాన్సర్ రోగులు వృద్ధి చెందుతుండటం చేత, ప్రతి రాష్ట్రంలోనూ క్యాన్సర్ కేర్ పర్యావరణ వ్యవస్ధల ఆవశ్యకత కూడా పెరిగింది. ఈ కార్యక్రమంతో, రోగి కేంద్రీకృత కాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నాము. ఇది ప్రామాణీకరమైన, అందుబాటు ధరల్లోని చికిత్సను తమ సొంత పట్టణంలో అందించనుంది. ఈ కార్యక్రమంతో మెట్రో నగరాలలో చికిత్స చేయించుకునేందుకు ప్రయాణపు అదనపు భారాన్ని సైతం తగ్గిస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రివర్యులు విడదల రజిని అన్నారు. రొమ్ము క్యాన్సర్ నిర్వహణలో ప్రభుత్వ డాక్టర్ల సామర్థ్యం బలోపేతం చేసేందుకు వర్క్‌షాప్
ఏపీ ప్రభుత్వం మరియు రోషీ ఫార్మా సంయుక్తంగా భారీ స్ధాయిలో వర్క్షాపను రొమ్ము క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సను తిరుపతిలో అందించేందుకు వీలుగా శనివారం 12 నవంబర్ 2022న నిర్వహించింది. దీనిద్వారా సామర్థ్య నిర్మాణం, అవగాహన విస్తరించడం, రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయడం చేయనుంది. ఈ వర్క్‌షాప్‌కు దాదాపు 200 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు హాజరయ్యారు. దీనిద్వారా రొమ్ము క్యాన్సర్ నిర్వహణలో లక్ష్యిత చికిత్సావకాశాల పట్ల చర్చను చేశారు. ఏపీ ప్రభుత్వంతో రోషీ ఫార్మా చేతులు కలపడంతో పాటుగా రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మద్దతును అందిస్తుంది. దీనితో పాటుగా డాక్టర్లకు అవసరమైన శిక్షణనూ అందిస్తుంది. ఈ వర్క్‌షాప్‌తో క్యాన్సర్ నిర్వహణ మరియు చికిత్సలో అంతరాలను పూరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఈ వర్క్‌షాప్‌లో వీడియో ద్వారా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు – హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ శ్రీ జీఎస్ నవీన్ కుమార్ ; మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరిశ్రమ మరియు విద్యా రంగానికి చెందిన ఇతర నిపుణులలో డాక్టర్ బి వెంగమ్మ, డైరెక్టర్ –వీసీ , శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ; శ్రీ ఎంఎన్ హరేంధ్రి ప్రసాద్ , సీఈఓ ; డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ మరియు డాక్టర్ జీవీఎస్ మూర్తి, డైరెక్టర్, ఐఐపీహెచ్, హైదరాబాద్ సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం గురించి రోషీ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ – సీఈఓ వీ సింప్సన్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ‘‘ రోషీ వద్ద, ప్రతి ఒక్కరూ సమయానుకూల మరియు ప్రభావవంతమైన చికిత్సకు అర్హులని నమ్ముతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సహకారంతో చేపట్టాము. రోషీ ఇప్పుడు ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటుగా హెల్త్‌కేర్ వ్యయం తగ్గించడం లక్ష్యంగా చేసుకుంది. ఈ తరహా ప్రయత్నాలతో ఏపీ తమ క్యాన్సర్ కేర్ పర్యావరణ వ్యవస్ధను బలోపేతం చేయడం తో పాటుగా నాణ్యమైన, సమయానుకూల చికిత్సను తమ ప్రజలకు అందిస్తుంది’’ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సమగ్రమైన క్యాన్సర్ కేర్ పథకం ఆరోగ్య శ్రీని మెరుగుపరచడంతో పాటుగా అన్ని రకాల క్యాన్సర్లకూ ఉచిత చికిత్సను అందిస్తుంది. ఇప్పటి వరకూ 400 కోట్ల రూపాయలను క్యాన్సర్‌పై ఖర్చు చేసింది. మొత్తం వ్యయంలో ఇది 25%. సమగ్రమైన క్యాన్సర్ కేర్ దిశగా ఏపీ ప్రయాణం ఇప్పుడు క్యాన్సర్ కేర్ కేంద్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్వీఐఎంఎస్) వద్ద దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2008లో ప్రారంభించడంతో మొదలైంది. ఇది మరింతగా ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్రెడ్డి గారు తిరుపతిలో బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (బీఐఓ)ను అత్యాధునిక సదుపాయాలతో ప్రారంభించడంతో వృద్ధి చేశారు.