Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి 3,500 కొత్త కార్ల విక్రయ కేంద్రాలకు విస్తరించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో నెక్సా నూతన షోరూంను తెరవడం ద్వారా ఈ మైలురాయికి చేరింది. నూతన అవుట్‌లెట్‌ను మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ, మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోబుటకా సుజుకి లాంచనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 2,250 నగరాల్లో విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు వారు తెలిపారు.