Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫీసులు మూత
శాన్ఫ్రాన్సిస్కో : ట్విట్టర్ ఉద్యోగులు అధిక పనిగంటలు, కష్టపడి పని చేయాలన్న ఆ సంస్థ చీఫ్ ఎలన్ మస్క్‌పై సిబ్బంది తిరుగుబావుట ఎగరవేశారు. మస్క్ నిర్ణయాన్ని చాలా మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. ''నిబంధనలకు లోబడి పని చేస్తారా.. వైదొలుగుతారా..?'' అని మస్క్ జారీ చేసిన ఆల్టిమేటంపై వందలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు స్వచ్ఛందంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం అయ్యారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలా మంది ఉద్యోగులు తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కంపెనీ తన కార్యాలయాన్ని తాత్కాలికంగా సోమవారం వరకు మూసివేసింది. ఈ విషయమై ఉద్యోగులకు సందేశాలు కూడా పంపారని సమాచారం. కంపెనీని వీడుతున్న వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ట్విటర్ పనితీరు ఎలా ఉంటుందనే కీలక సమాచారం తెలిసిన వ్యక్తులు, బందాలు సైతం కంపెనీని వీడడానికి సిద్ధమైనట్లు సమాచారం. మస్క్ కీలక బృందాలతో జరిపిన భేటీలో అనేక మంది మధ్యలోనే వెళ్లిపోయారని తెలుస్తోంది. నిజానికి బుధవారం నాటి అల్టిమేటం వల్ల ఈ స్థాయిలో ఉద్యోగులు కంపెనీని వీడతారని మస్క్ అంచనా వేయలేదని బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్టులో పేర్కొంది. కాగా.. సామూహిక నిష్క్రమణల పట్ల తానేం అంతగా ఆందోళన చెందడం లేదని మస్క్ ఓ ట్వీట్లో తెలిపారు.