Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐడిఎఫ్సి బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఎథర్ ఎనర్జీ తెలిపింది. దీంతో పరిశ్రమలో తొలిసారిగా ఇవి ఫైనాన్సింగ్ అవకాశాన్ని తమ వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొంది. ఎథర్ 450 ఎక్స్ స్కూటర్‌ను సంప్రదాయ పెట్రోల్ స్కూటర్లకయ్యే నెలవారీ ఖర్చుతో సొంతం చేసుకునే అవకాశం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ వాహనానికి ఆన్ రోడ్ ధరపై కేవలం 5 డౌన్ పేమెంట్‌తో ఎథర్ 450 ఎక్స్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. మిగిలిన మొత్తాన్ని 8.5 శాతం వార్షిక వడ్డీరేటుతో పొందవచ్చని వెల్లడించింది. 48 నెలల కాల వ్యవధితో రుణం అందిస్తున్నట్లు పేర్కొంది.