Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీ కితాబు ఇచ్చారు. 2050 నాటికి ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ రెండో అతిపెద్దదిగా అవతరించనుందన్నారు. ముంబయిలో జరిగిన 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ.. ప్రస్తుతం బహుళ దృవ ప్రపంచం ఆవిర్బవిస్తోందని..ఆర్థికంగా పరిపుష్టి కలిగిన దేశాలు కష్టకాలంలో ఉన్న దేశాలను ఆదుకోవాలని సూచించారు. ప్రస్తుతం భారత్ 3.5 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ, ఆర్థిక సంస్కరణల ఫలితంగా వచ్చే దశాబ్దంలో శరవేగంగా వద్ధి చెందబోతోందన్నారు. కేవలం 12-18 నెలల్లోనే ఒక్కో ట్రిలియన్ డాలర్లు చొప్పున పెరుగుతూ 2050 నాటికి 30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నారు. దేశంలో హెచ్చు ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం తాండవిస్తూ.. వృద్థి రేటును దెబ్బతీస్తున్న ప్రస్తుత తరుణంలో అదానీ ప్రకటన విస్మయాన్ని కల్పిస్తుంది.