Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలోనూ మాంద్యం చాయలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు నిధులు దొరక్క తీవ్ర ఒత్తిడిలోకి జారుకున్నాయి. అనేక మంది ఉద్యోగులను తొలగించాయి. కొత్త పెట్టుబడులు ఊసే లేకుండా పోయింది. ఇదే బాటలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మేర మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు పేర్కొన్నాయి. మరింత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని సమాచారం. జొమాటోలో ప్రస్తుతం 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయని ఆ కంపెనీ కూడా స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది తరహాలోనే పనితీరు ఆధారిత మదింపు ప్రక్రియలో భాగంగానే మూడు శాతం ఉద్యోగులను తొలగిస్తున్నామని తెలిపింది. అంతకు మించి ఏమీ లేదని పేర్కొంది.