Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వాట్సాప్ గ్రూపులు అందరికి ఆనందం. రొదసోదల కుటుంబ గ్రూపుల నుంచి సహోద్యోగులుతో సహకరించుకోవడం లేదా మిత్రుడి పుట్టినరోజు పార్టీని ప్లాన్ చేసుకోవడం వరకు, వాట్సాప్ గ్రూపులు అంతా అంతరాయం లేకుండా మరియు సురక్షితంగా చేస్తాయి. కాని కొద్ది రోజులు మటుకు, మనకు సంబంధం లేని గ్రూపలు జోడించబడడం లేదా ధృవీకరించబడని ఫార్వర్డ్స్ రావడం వంటి సంఘటనలు మనము సంభాళించుకోవల్సి ఉంటుంది. అది ఎంత సవాలుగా ఉన్నా, యుజర్స్ వారి స్నేహితులతో మరియు కుటుంబంతో ప్రతిస్పందిస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నారని నిర్థారించుకోడానికి వాట్సాప్పైన అందుబాటులో ఉన్న వివిధ భద్రతా ఫీచర్స్ వాడడం ద్వారా వారి అనుభంవం పైన నియంత్రణ తెచ్చుకోవచ్చు.
మీరు ఇప్పుడే వాడడం ప్రారంబించాల్సిన అగ్ర భద్రతా ఫీచర్స్ ఇవిగో:
బ్లాక్ మరియు రిపోర్ట్: సాంప్రదాయక ఎస్ఎంఎస్ లాగ కాకుండా, వాట్సాప్ యుజర్స్‌కి ఒకవేళ వారు ఏదేని సమస్యాత్మకమైన సదేశాలు వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్స్‌లో ఎదుర్కోంటే అకౌంట్స్‌ని బ్లాక్ చేసి మరియు వాట్సాప్‌కి రిపోర్ట్ చేయవచ్చు. మేము యుజర్స్ని సమస్యాత్మకమైన పరిచయాలని మాకు రిపోర్ట్ చేయమని ప్రొత్సహిస్తున్నాము. అదనంగా, ఇప్పుడు వ్యక్తులకు వారు రిపోర్ట్ చేసిన సందేశాలను వారి ఫోన్లోనే ఒకవేళ వారు వాటిని వాస్తవాన్ని-తనిఖీ చేసేవారు లేదా న్యాయ అధికారులతో పంచుకోవాలనుకుంటే ఉంచుకునేందుకు ఎంపికను అందిస్తున్నాము.
ఫార్వర్డ్ పరిమితులు: ఒక చాట్‌కి ఒకసారి కన్నా అధికంగా సందేశాలు ఫార్వర్డ్ చేయడాన్ని పరిమితం చేస్తూ, ఇది వాట్సాప్ అంతటా ఈ రకం విషయాన్ని 70% తగ్గించడంలో ఫలించింది దీనికి తోడుగా, ఎక్కడైతే సందేశాలకు "ఫార్వర్డ్ చేయబడ్డ లేబుల్" ఉంటుందో అవి ఐదు గ్రూపులకు ఒకేసారి కన్నా, ఒక సమయంలో ఒక్క గ్రూప్‌కే ఫార్వర్డ్ చేయబడేట్లుగా కొత్త గ్రూపు ఫార్వర్డింగ్ పరిమితులు కూడా పరిచయం చేయబడ్డాయి. ఒకవేళ సందేశం యొక్క మూలం మీకు అనుమానాస్పదంగా ఉంటే, దాన్ని ఫార్వర్డ్ చేయకండి.
గ్రూపు గోప్యతా సెట్టింగ్స్: వాట్సాప్ పైన, మీ ఫోన్ నంబర్ ఉన్న వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని గ్రూపులో జోడించగలరు. వాట్సాప్ గ్రూపు గోప్యతా సెట్టింగ్స్ మరియు గ్రూపు ఆహ్వాన సిస్టమ్ యుజర్స్ని ఎవరు గ్రూపులలో వారిని జోడించవచ్చో నిర్ణయించుకోడానికి అనుమతిస్తుంది. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఏదేని గ్రూపులో ఎవరు జోడించడానికి వీలు ఇవ్వకండి. ఈ మూడు ఎంపికలు మిమ్మల్ని - ప్రతివారు, మీ పరిచయాలు, లేదా మీరు మీ పరిచయాల్లోంచి ఎన్నుకున్న వారు మిమ్మల్ని గ్రూపుకి జోడించవచ్చు నుండి ఎంచుకోనిస్తుంది.
గ్రూపు నుంచి నిశబ్ధంగా తొలగండి: మీరు గ్రూపు నుంచి నిశబ్ధంగా నిష్క్రమించాలని ఎంచుకున్నప్పుడు, అది చాట్ థ్రెడ్‌లోని అందరికి తెలియనివ్వదు కేవలం గ్రూపు ఎడ్మిన్స్కి మాత్రమే తెలియజేస్తుంది. యుజర్స్ని వారు ఇక ఉండడానికి ఇష్టపడని గ్రూపులను సౌకర్యవంతంగా వెళ్ళెందుకు సహాయపడడం ఈ ఫీచర్ లక్ష్యం.
ఎడ్మిన్ నియంత్రణ: డీఫాల్ట్‌గా, గ్రూపులో పాల్గొనే ఎవరైనా సందేశాలు పంపించవచ్చు మరియు గ్రూపు సబ్జెక్ట్, ఐకాన్, లేదా వివరణతో సహా, గ్రూపు సమాచారాన్ని మార్చవచ్చు. అయినప్పటికినీ, వాట్సాప్ సెట్టింగ్స్ ఎడ్మినిస్ట్రేట్రస్కి గ్రూపు లోపల ఎవరు సందేశాలు పంపించవచ్చు నిర్ణయించడానికి సామర్థ్యం ఇస్తుంది.
వాట్సాప్ పైన వాస్తవం తనిఖీ చేయడం: భారతదేశంలో, వాట్సాప్ పైన వాస్తవం తనిఖీ చేయడానికి 10 స్వతంత్ర సంస్థలు ఉన్నాయి ఇవి యుజర్స్‌కి సమాచారాన్ని గుర్తించడం, సమీక్షించడం, మరియు ధృవీకరించడంలో సహాయం చేస్తాయి మరియు దాని వేదిక మీద తప్పుడు సమాచారం విస్తరించకుండా నివారించడంలో సహాయం చేస్తాయి. అదనంగా, దాని యుజర్స్ ఒక సందేశాన్ని లేదా సమాచారాన్ని చెల్లుబాటుతనాన్ని చూడడానికి ది ప్యొంటెర్ ఇన్స్టిట్యూట్ IFCN వాట్సాప్ చాట్బొట్కి టెక్స్ట్ చేయడం ద్వారా సమాచారాన్ని ధృవీకరించుకోడానికి సామ్ర్థ్యం వాట్సాప్ ఇస్తుంది. వాట్సాప్ యుజర్స్ని అనుమానాస్పందంగా లేదా తప్పుడుగా ఉన్న వార్తలు ధృవీకరించమని ప్రోత్సహిస్తుంది.
వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడ్డ సందేశాలు ఇచ్చే సేవలలో దుషణని నివారిస్తూ మరియు ఆన్లైన్ భద్రతని ప్రచారం చేసే పరిశ్రమలోని అగ్రగాముల్లో ఒకటి. మిమ్మల్ని మరియు మీ రహస్య సందేశాలను భద్రంగా ఉంచడానికి కట్టుబడి, వాట్సాప్ యుజర్స్ని సాధనాలు, ఫీచర్స్, మరియు రిసోర్సెస్‌తో వారు సమాచారం ఇవ్వబడిన నిర్ణయాలు తీసుకోడానికి సహాయం చేయడానికి మరియు మీ కమ్యూనికేషన్ భద్రంగా మరియు సురక్షితంగా ఉంచడానికి సాధికారత ఇవ్వడాన్ని నమ్ముతుంది.