Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శామ్ సంగ్, భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, 27 ప్రముఖ సంస్థలు నుండి 9,000 మంది విద్యార్థులు పాల్గొన్న తమ పాన్-ఇండియా క్యాంపస్ ప్రోగ్రాం శామ్ సంగ్ E.D.G.E. ఏడవ ఎడిషన్ ను ముగించింది.
ఐఐఎం బెంగళూరులో టీమ్ ట్రాన్ సెన్ డెన్స్ కు చెందిన శ్రేయాస్ ఎస్, అమృత సింగ్ మరియు షిండే చైతన్య శరద్ లు మొదటి బహుమతి అందుకున్నారు. భారతదేశంలోని వినియోగదారులు కోసం IoT డివైజ్ లను అనుసరించడంలో మెరుగుదల కోసం తమ కొత్త మరియు ఆధునిక పరిష్కారం జ్యూరీని ఎంతగానో ప్రభావితపరిచింది మరియు వారు 450,000 రూపాయలు నగదు బహుమతిని గెలుపొందేలా చేసింది. శామ్ సంగ్ నుండి శామ్ సంగ్ వారి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్ మరియు ప్రీ-ప్లేస్మెంట్స్ ఆఫర్స్.
పూర్తి మోషన్ వీడియో ద్వారా గామిఫికేషన్ ను వినియోగించి వినియోగదారులతో నేరుగా సంప్రదించే ఆధునిక విధానాలు కోసం తమ డిజైన్ పరిష్కారంతో ఎన్ఐడీ బెంగళూరుకు చెందిన టీమ్ సృజన్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ టీమ్ 300,000 రూపాయల నగదు బహుమతి మరియు శామ్ సంగ్ తో ప్రీ-ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ ను గెలిచింది.
వినియోగదారులు ఇన్-స్టోర్ స్మార్ట్ హోమ్ మోడల్ మరియు మెటావెర్స్ ఎక్స్ పీరియెన్స్ స్టోర్ ద్వారా కనక్టెడ్ డివైజెస్ వ్యవస్థను అనుభవించడానికి పరిష్కారాన్ని అందించి ఐఐఎఫ్ టీ నుండి టీమ్ జీ.యూ.జీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ జట్టు 150,000 నగదు బహుమతి గెలుచుకుంది.
ఆన్ లైన్ లో రెండేళ్లు ప్రోగ్రాంను నిర్వహించిన తరువాత, శామ్ సంగ్ ఈ.డీ.జీ.ఈ 2022 ఎడిషన్ భౌతికమైనది. గురుగ్రామ్ లో జరిగిన ఫినాలేకు శ్రీ కెన్ కాంగ్, ప్రెసిడెంట్ & సీఈఓ, శామ్ సంగ్ నైరుతి ఆసియా , మరియు శామ్ సంగ్ ఇండియా ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
"శామ్ సంగ్ లో, మేము యువ మేధస్సుల తెలివిని పోషిస్తాం, వారిలో నిజమైన నవ్యత స్ఫూర్తిని తీసుకువస్తాం. మార్పును ప్రోత్సహించాలని కోరుకుంటున్న విద్యార్థుల సృజనాత్మకమైన మరియు కొత్త ఆలోచలనలను నిజం చేయడానికి ఒక వేదికగా, శామ్ సంగ్ E.D.G.E. నిరంతరం కృషి చేస్తోంది. మేము భౌతిక కార్యక్రమానికి మళ్లీ వచ్చినందుకు మరియు యువ మేధస్సులు, రేపటి నాయకులతో అనుసంధానం చెందినందుకు ఆనందిస్తున్నాము. భారతదేశంలో ఈ ఏడాది క్యాంపసెస్ లో పాల్గొనడానికి చూపించిన ఉత్సుతక స్థాయి ఉద్వేగం కలిగించింది," అని సమీర్ వాధ్వాన్, హెడ్, హ్యూమన్ రిసోర్సెస్, శామ్ సంగ్ ఇండియా అన్నారు. ప్రతి ఏడాది యువ మేధస్సులు వ్యాపార నైపుణ్యం, వ్యూహాత్మకమైన ఆలోచన మరియు నాయకత్వం నైపుణ్యాలు చూపించడానికి ఒక అవకాశం అందించే శామ్ సంగ్ E.D.G.E. అనేది దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్ వేదిక. 2016లో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ప్రముఖ బీ-స్కూల్స్, ఇంజనీరింగ్ & డిజైన్ సంస్థలు నుండి తెలివైన విద్యార్థులు పాల్గొంటున్నారు మరియు వాస్తవిక సమయం సమస్యలకు విలక్షణమైన పరిష్కారాలు అందిస్తున్నారు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి, అర్థవంతమైన సమాచారం పరస్పరం తెలియచేయడానికి, తమ కెరీర్స్ ను ఆరంభించడానికి ఈ ప్రోగ్రాం అవకాశం కలగచేస్తుంది. ఈ 2 నెలల కార్యక్రమం మూడు విడతల విస్త్రతమైన అంచనాతో నిర్వహించబడింది. ఈ ఏడాది 27 కళాశాలలు నుండి 2,700కి పైగా జట్లు పాల్గొన్నాయి. పాల్గొంటున్న ప్రతి టీమ్ మొదటి రౌండ్ లో క్షుణ్ణంగా పరిశోధన, ఆలోచనలు చేసిన తరువాత కార్యనిర్వాహక సంగ్రహం సమర్పించారు. అంచనా తరువాత, ప్రతి క్యాంపస్ నుండి ఒక టీమ్ ఎంపికైంది. వారు కేస్ అధ్యయనం పై పని చేసారు మరియు తమ ప్రాంతీయ రౌండ్ లో తమ వివరణాత్మకమైన పరిష్కారాలను సమర్పించారు. ఈ ఏడాది, తొమ్మిది టీంస్ ఎంపిక చేయబడ్డాయి మరియు జాతీయ స్థాయి రౌండ్ లో ప్రముఖ 3 ప్రదేశాలు కోసం పోటీపడటానికి శామ్ సంగ్ నాయకుల ఆధ్వర్యంలో శిక్షణ పొందాయి.