Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిజిటల్ సమ్మిళిత దిశగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు ముందుకు వేయడంతో పాటుగా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ సదుపాయంతో ఖాతా తెరిచే ప్రక్రియ మరింత సౌలభ్యంగా మారడంతో పాటుగా వినియోగదారుల కోసం ఈ సేవలను మరింత సులభంగా మారుస్తోంది. ఈ నూతన సదుపాయం బ్యాంక్ యొక్క బిజినెస్ కరస్పాండెంట్స్(బీసీలు)కు కేవలం ఫేస్ అథెంటికేషన్ ఈఉకెవైసీ చేపట్టడంతో ద్వారా ఖాతా తెరిచేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అథెంటికేషన్‌ను యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) నూతనంగా అభివృద్ది చేసిన మొబైల్ అప్లికేషన్ వినియోగించి ప్రాసెస్ చేస్తారు. బిజినెస్ కరస్పాండెంట్స్కు ఇప్పుడు కేవలం ఖాతా తెరిచేందుకు స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది. ఈ బ్యాంక్ ఇప్పుడు ఈ సంవత్సరాంతానికి 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్ల వ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రారంభం గురించి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీఉసీఈఓ అనుబ్రత బిశ్వాస్ మాట్లాడుతూ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వద్ద మేము మా బొటిక్ డిజిటల్ సేవలను తాజా సాంకేతికతలను వినియోగించి బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాము. తద్వారా వినియోగదారులకు అత్యంత అనుకూలమైన రీతిలో మెరుగైన డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలను అందించనున్నాము. ఈ సురక్షిత మరియు సెక్యూర్ అథెంటికేషన్ ప్రక్రియ, యుఐడీఏఐ యొక్క ప్రయత్నాల కారణంగా సాధ్యమైంది. దేశంలో సమ్మిళిత బ్యాంకింగ్ సాధ్యం చేసే దిశగా వేసిన మరో అతి పెద్ద ముందడుగు అని అన్నారు. ఈ కెవైసీ సదుపాయం ఏఐ/ఎంఎల్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ఆర్డీ అప్లికేషన్ వినియోగించుకుంటుంది. దీని కారణంగా ఆధార్‌లో నమోదైన చిత్రంతో వ్యక్తుల ఫోటోలను సరిపోల్చుకుని మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్టవేస్తుంది. దీనితో పాటుగా సురక్షితంగా వినియోగదారులు తమ ఖాతాలను తెరిచేందుకూ తోడ్పడుతుంది అని అనుబ్రత బిశ్వాస్ అన్నారు.
ఇప్పటి వరకూ, ఓ వినియోగదారుడు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో ఖాతా తెరవాలనుకుంటే ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా తెరిచేవారు.
భారతదేశంలో టియర్ 1, మెట్రో నగరాలకు ఆవల నివాసముంటున్న డెబిట్ కార్డు వినియోగదారులకు మైక్రో ఏటీఎం లావాదేవీలను అందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) యొక్క నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్) తో ఇటీవల కాలంలో మిళితమైన తరువాత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చేపట్టిన మరో కార్యక్రమం ఇది.