Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని టి హబ్‌లో ఐఇబిసి కాంటినమ్ అండ్ వెబ్ 3.0 హ్యాక్‌ఫెస్ట్ ఛాలెంజ్‌ను ఏర్పాటు చేసినట్లు ఐబిసి మీడియా తెలిపింది. మంగళవారం దీన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టాస్క్ సిఇఒ శ్రీకాంత్ సిన్హా. టిహబ్ సిఇఒ శ్రీనివాసరావు మహంకాళి, ఐబిసి మీడియా ఫౌండర్, సిఇఒ అభిషేక్ పిట్టీ లాంచనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న నైఫుణ్యవంతులు, విద్యార్థుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు అభిషేక్ తెలిపారు. అదే విధంగా ఐబిసి ఎజెండాకు హెడ్లైన్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న పోల్కాడాట్ మద్దతుతో ఇంటర్నేషనల్ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఐబిసి 2.0 రెండవ ఎడిషన్ కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని ప్రత్యేకంగా వెబ్ 2.0 సామర్ధ్యంల నుంచి ఇంజినీరింగ్ స్టూడెంట్ కమ్యూనిటీ వెబ్ 3.0 ఇండిస్టీ రెడీ డెవలపర్స్‌గా మారడానికి ఇది తోడ్పడుతుందన్నారు.