Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం వస్తు సేవల పన్ను (జిఎస్టి) విధించాలని కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ సిఫారుసు చేయనుందని సమాచారం. దీనికి సంబందించిన మంత్రుల బృందం ప్రతిపాదనలు దాదాపు ఖరారు అయ్యాయని తెలుస్తోంది. త్వరలో జరగనున్న జిఎస్టి కౌన్సిల్ దీనికి ఆమోదం తెలపడమే ఆలస్యమని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఈ రంగం మార్కెట్ రూ.13,600 కోట్లుగా ఉందని అంచనా. ప్రస్తుతం 18 శాతం జిఎస్టి అమల్లో ఉండగా.. ఇక గరిష్ట శ్లాబు 28కి చేర్చనున్నారు.