Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత్ నుంచి విదేశీ విద్యా సంస్థల రుసుముల చెల్లింపులను డిజిటైజ్ చేయడానికి ఫ్లైవేర్తో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యా సంబంధిత ఫీజుల చెలింపుల కోసం పూర్తి డిజిటల్ చెక్ఔట్ అనుభవాన్ని అందించనున్నట్లు పేర్కొంది. ప్రపంచమంతటా ఉన్నత విద్యా సంస్థలకు అంతర్జాతీయ విద్యా రుసుము అంతరాయం లేకుండా చెల్లించేందుకు దోహదం చేయనుందని పేర్కొంది. 2022 ఒపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 2 లక్షల మంది భారత విద్యార్థులు ఒక్క అమెరికాలో చదువులు సాగిస్తున్నారు.