Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొట్టచ్చినట్లు కన బడుతోంది.ఈ నేపథ్యంలోనే గ్లోబల్ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమె జాన్, మెటా, ట్విట్టర్, జొమాటో బాటలోనే తాజాగా గూగుల్ మాతృసంస్థ అల్బాబెట్ కూడా భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు సమాచారం. ఖర్చు తగ్గించుకునే పనిలో గూగుల్ 10వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిచడానికి కసరత్తు చేస్తుందని మంగళవారం రిపోర్టులు వచ్చాయి. వ్యయాలను తగ్గించు కోవాలంటూ ఇన్వెస్టర్ల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 6 శాతం మందికి కోత పెట్టాలని యోచిస్తోంది. తొలుత అత్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ విషయమై ఇప్పటికే మేనేజర్లకు సూచనలు చేసిందని తెలుస్తోంది. ఆల్ఫాబెట్లో దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.