Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో శారీరక వైకల్యానికి నాలుగో అతి పెద్ద కారణంగా ఆర్థరైటిస్ ఉంటుందని అంచనా1. వ్యాధి ముదురుతున్న కొద్ది నొప్పి కారణంగా రోగుల్లో వైకల్యాలు ఏర్పడటంతో పాటు శారీరక కదిలికలు కూడా పరిమితమైపోయి వారి ఉత్పాదక సంవత్సరాలు తగ్గుతాయి. పెరుగుతున్న అర్థరైటిస్ కేసుల విషయంలో అవగాహన పెంచేందుకు. చికిత్సలో సాధించిన సరికొత్త విజయాల గురించి వివరించేందుకు జాన్సన్ & జాన్సన్ మెడ్‌టెక్ ఇండియా, గంగా మెడికల్ సెంటర్ & హాస్పిటల్స్ నేడు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అర్థరైటిస్ బాగా ముదిరిన సందర్భాల్లో మోకాలి మార్పిడి ఆపరేషన్ అన్నది అత్యంత ఆచరణీయమైన పరిష్కారాల్లో ఒకటిగా ఆవిర్భావించింది. భారతదేశంలో 20202 లో 2 లక్షలకు పైగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి, శస్త్ర చికిత్స అవసరమైన రోగుల సంఖ్య 60 లక్షలకు కాగా జరిగిన శస్త్ర చికిత్సలు అతి స్వల్పం మాత్రమే. జీవనశైలి సంంబధిత వ్యాధులు పెరుగుతున్న కొద్ది అర్థరైటిస్ కేసుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ప్రతీ రోగి భిన్నంగా ఉన్నట్టే ప్రతీ మోకాలు బిన్నంగా ఉంటుంది. రోగులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు, అలాగే రికవరీ సమయాన్ని తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీ వైపు సర్జన్లు తరచూ చూస్తున్న పరిస్థితి. సృజనాత్మక రోబొటిక్ ఆధారిత టెక్నాలజీ ఆవిష్కరణ జరగడంతో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మోకాలి మార్పిడి సర్జీరీలో కఛ్చితత్వం, వ్యక్తీగతికరణ పెరిగింది. రోగులు తిరిగి తమ జీవితాల్లోకి వేగంగా చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానం రూపొందించడం జరిగింది.
జాన్సన్ & జాన్సన్ మెడ్‌టెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ మక్కర్ మాట్లాడుతూ: “ప్రస్తుతం, భారతదేశంలో సుమారు 20,0003 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు సుమారు 130 కోట్ల జనాభాకు సేవలు అందిస్తున్నారు. నైపుణ్యంతో కూడిన సంరక్షణ అన్నది పెద్ద నగరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారీ భారాన్ని మోపుతోంది. భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులను భవిష్యత్ కోసం సిద్ధం చేసి వారికి సంక్లిష్టమైన సర్జరీలు సహ రోబోటిక్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితమైన, ప్రభావవంతమైన రీతిలో శిక్షణ అందించేందుకు జాన్సన్ & జాన్సన్ మెడ్‌టెక్ ఇండియా కట్టుబడి ఉంది. కేవలం మెట్రో నగరాల్లోనే కాదు 2-3 శ్రేణి నగరాలకు కూడా వర్చువల్ రియాల్టీ, డేటా డ్రివెన్ టెక్నాలజీలు సహ ప్రపంచస్థాయి శిక్షణా పరికరాలతో మేము రోగులకు వ్యక్తిగత సంరక్షణను అందిస్తూ వారు మెరుగైన ఫలితాలు సాధిస్తూ తొందరగా కోలుకునేలా చూస్తున్నాం” అన్నారు.
గంగా మెడికల్ సెంటర్ & హాస్పిటల్స్ ఆర్థోపెడిక్స్, ట్రామా & స్పైన్ సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్) ఎస్. రాజశేఖరన్ మాట్లాడుతూ: “కదలికలన్నవి జీవితం, జీవితమంటేనే కదలిక” అన్నది ఆరోగ్యపరంగా నేడు గట్టిగా వినిపిస్తున్న మాట. మీకు తీవ్రమైన అర్థరైటిస్ ఉంటే కీళ్లలలో చాలా నొప్పి ఉంటుంది, అది మీ కదలికలను కట్టడి చేస్తుంది. ఇది రోగిపై అనేక విధాలుగా చిక్కులు కలిగిస్తుంది. మొదటిది, అటు ఇటు కదలనీయకుండా చేసే నొప్పి కారణంగా వారి నిత్యజీవితం దుర్భరంగా మారిపోతుంది. కొన్నిసార్లు వారి రాత్రి వేళ నిద్ర కూడా దూరమవుతుంది. రెండోది, వారి స్వేచ్ఛను హరిస్తుంది, ప్రతీదానికి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడోది, అది ముఖ్యమైనది, అది ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసి రోగి తన ఆత్మగౌరవాన్ని కోల్పేయేలా చేస్తుంది. ఈ సమస్యకు జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం. అది వారికీ రెండో జీవితాన్ని అందిస్తుంది. మోకాలి మార్పిడి అన్నది చాలా విజయవంతమైన ప్రక్రియ అయినప్పటికీ, రోబోటిక్ అసిస్టెడ్ టెక్నాలజీ అన్నది ఈ రంగంలో తదుపరి అతిపెద్ద ఆవిష్కరణగా చెప్పవచ్చు. ఇది రోగి శరీరతత్వాన్ని బట్టి ప్రొస్థెసిస్ పరిమాణాన్ని పెట్టాల్సిన ప్రదేశాన్ని కచ్చితంగా చూపుతుంది. మోకాలి కదలిక సంపూర్ణ శ్రేణిలో మృదువైన కదలికలతో కచ్చితమైన బ్యాలెన్సింగ్ ఉండేలా చూసేందుకు అధునాతన సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇవన్నీ నొప్పికి సంబంధించి మెరుగైన ఫలితాలు అందించడమే కాదు త్వరగా కదిలేలా చూడటం, ఆస్పత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు ఇంప్లాంట్ ఎక్కువ రోజులు ఉండేలా చూస్తాయి” అని తెలిపారు. రోగులకు ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసుకు తగిన ప్రణాళిక రూపొందించుకునేందుకు రోబొటిక్స్ ఆదారిత సాంకేతిక పరిజ్ఞానం సర్జన్లకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంతే కాదు, సర్జరీ చేసే ప్రదేశపు రియల్ టైమ్ చిత్రాన్ని అందించడం ద్వారా మోకాలి ఇంప్లాంట్‌ను చక్కగా చూసేందుకు కొన్ని కొత్త తరం రోబొటిక్ ఆదారిత పరిష్కారాలు సర్జన్లకు ఎంతోగానే సాయపడతాయి. వీలి ద్వారా రోగులకు అనవసరమైన కంప్యూటెడ్ టోమోగ్రాఫి (సీటీ) స్కాన్ రేడియేషన్ చికాకులు రోగులకు తొలగిస్తుంది. రోగుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసే వ్యక్తిగతమైన సర్జరీల ద్వారా రోగులకు మెరుగైన ఫలితాలతో పాటు కదలికలు మెరుగుపడటం, వేగంగా రికవరీ సాధ్యమవుతుంది. రోగులు, సర్జన్లు, సంరక్షణా బృందాలకు మెరుగైన అనుభూతి అందించేలా రోబొటిక్ ఆదారిత సాంకేతిక పరిజ్ఞానా్నని రూపొందించడం జరిగింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సర్జన్ల వైద్య నైపుణ్యం, రోబోటిక్స్ ద్వారా రోగులు వ్యక్తిగత సంరక్షణను అందుకోగలుగుతారు. భవిష్యత్‌లో చేసే సర్జరీలను ఇది పూర్తిగా మార్చేసి రోగులకు మెరుగైన ఫలితాలు అందడంతో పాటు అర్థరైటిక్ సంబంధిత వ్యాధుల భారాన్ని తగ్గించుకోగలుగుతారు.