Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : “బాలల దినోత్సవం పురస్కరించుకొని నవంబర్ 14 సందర్భంగా ఫినో పేమెంట్స్ బ్యాంక్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా కేరళలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అవగాహన శిబిరాలను నిర్వహించింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రతినిధులు పాఠశాల పిల్లలకు పొదుపు యొక్క ప్రాముఖ్యతను మరియు పిల్లల నిర్దిష్ట బ్యాంక్ ఖాతాను తెరవడం ద్వారా వారు ఈ అలవాటును క్రమశిక్షణతో ఎలా పెంచుకోవచ్చో వివరించారు. ఈ రాష్ట్రాల్లోని 150 పాఠశాలల్లోని 10,000 కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ అవగాహన కార్యక్రమమం తో ప్రయోజనం పొందారు పిల్లలు ఫినోతో మైనర్ సేవింగ్స్ ఖాతాను కూడా ప్రారంభించారు, ఇది వారికి గొప్ప భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడే తగిన బహుమతి అని సంస్థ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.