Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రెడిట్ సూసెలో 9000 మందికి కత్తెర
న్యూయార్క్ : స్టార్టప్‌ల నుంచి దిగ్గజ టెక్ కంపెనీలను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్, మెటా, అమెజాన్, సిస్కో సహా వివిధ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తున్నాయి. ఇదే బాటలో తాజాగా హెచ్‌పీ సైతం 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి కసరత్తును ప్రారంభించింది. కంప్యూటర్ల అమ్మకాలు పడిపోవడం, ఇతర టెక్ కంపెనీల తొలగింపులతో పోల్చితే తమ తీసివేతలు తక్కువేనని హెచ్‌పీ సీఎఫ్ఓ మారీ మీర్స్ పేర్కొన్నారు.
క్రెడిట్ సూసెలో 12 శాతం మందికి కత్తెర
జ్యూరిచ్ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్ సూసె 9,000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు 2,700కి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 12శాతం అంటే 9,000 మందిని ఇంటికి పంపించ నున్నట్లు పేర్కొంది. కంపెనీ వెల్త్ మేనేజ్మెంట్ విభాగం పూర్తిగా నష్టా ల్లోకి జారుకోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రస్తుత డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13వేలకోట్లు) నష్టాలు చవి చూసే అవకాశం ఉందని అంచనా వేసింది.