Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ తన రెండు పాల సీలను నిలిపివేస్తున్నట్లు ప్రక టించింది. ఎల్ఐసీ జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించు కుంటు న్నట్లు బుధవారం వెల్లడించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు విని యోగంలో ఉండవని స్పష్టం చేసింది. 2019 ఆగస్ట్‌లో జీవన్ అమర్ ప్లాన్, ఆ ఏడాది సెప్టెంబర్‌లో ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్లను ఆవిష్కరించింది. రీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగడం వల్లనే తొలగిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఈ రెండు పాలసీల్లో పలు మార్పులను చేసి మళ్లీ అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. కాగా.. ఇప్పటికే ఈ రెండు పాలసీలను కొనుగోలు చేసిన వారికి సేవలు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. కొత్త పాలసీల జారీ ఉండదని స్పష్టం చేసింది.