Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఅండ్‌జీ ఇన్వెస్ట్మెంట్ వెల్లడి
న్యూఢిల్లీ : అపార కుబేరుడు, ప్రధానీ నరేంద్ర మోడీకి సన్నిహితుడగా గుర్తింపు ఉన్న గౌతమ్ అదానీకి అప్పులు ఎక్కువ, నగదు రాబడి తక్కువగా ఉందని ఎంఅండ్‌జీ ఇన్వెస్ట్మెంట్ (సింగపూర్) పీటీఈ పేర్కొంది. ''పోర్టులు, విమానాశ్రయాలు, రైలు, లాజిస్టిక్స్ వ్యాపారాలు అదానీకి నగదును ఉత్పత్తి చేసేవిగా ఉన్నాయి. అయితే అదానీ గ్రూపునకు సంబంధించి అనేక అస్పష్టతలు, సమాచారం బయటికి ఇవ్వకపోవడం, విలువ గురించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇది చాలా గమ్మత్తయినది.'' అని సింగపూర్‌కు చెందిన ఫండ్ మేనేజర్ వికాస్ పర్షద్ ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. ''కంపెనీలు చిన్నగా ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు సులభంగా చెబుతారు. కానీ.. భారత స్టాక్ మార్కెట్లలో 6 శాతం వాటా కలిగిన అదానీ గ్రూపు విలువ, వ్యాపారాలు నాకు అర్థం కావడం లేదు. ''పెట్టుబడిదారులు, ఇష్టపడినా ఇష్టపడకపోయినా.. ఆ కంపెనీ ఏమి చేస్తుందో దానిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఏడాదిలో అదానీ ఎంటర్ప్రైజెస్ విలువ 160 రెట్లు పెరిగింది. ఈ విలువను ఏ సమయంలోనైనా సమర్ధించడం కష్టం.'' అని పెర్షాద్ చెప్పారు. గుజరాత్ కేంద్రంగా పని చేస్తోన్న అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ రుణాలు- ఈక్విటీ నిష్పత్తి 2,021 శాతంగా ఉంది. అంటే రూ.1 ఈక్విటీ విలువపై రూ.2,021 మొత్తాన్ని అప్పుగా పొందుతున్నారని ఇటీవల బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ 2022 మార్చి ముగింపు నాటికి రూ.43,500 కోట్ల అప్పుల్లో ఉందని అంచనా.ఇంతక్రితం ఏడాది రూ.19,700 కోట్ల అప్పులతో పోల్చితే 119 శాతం పెరుగుదల ఉంది.