Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డైసన్ తన పెట్ గ్రూమ్ టూల్‌ను భారతదేశంలో విడుదల చేసి, పెంపుడు జంతువుల జుట్టు నిర్వహణ ఇప్పుడు మరింత సరళం చేసింది. పెంపుడు జంతువుల జుట్టు చుట్టూ ఉన్న సవాళ్లకు ఉపశమనాన్ని అందించేలా తయారు చేసిన నూతన విప్లవాత్మక పరికరం పెంపుడు జంతువులను సాకుతున్న వారికి వారి పెంపుడు జంతువులకు వదులుగా ఉన్న జుట్టును బ్రష్ చేసేందుకు మరియు తొలగించిన జుట్టను నేరుగా డైసన్ కార్డ్-ఫ్రీ వాక్యూమ్ క్లీనర్‌లలోకి సేకరించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
పెంపుడు జంతువులను పెంచుకునే వారు డైసన్ పెట్ గ్రూమింగ్ కిట్‌ను (Dyson Pet grooming kit)మీడియం మరియు పొడవాటి బొచ్చు ఉన్న పెంపుడు జంతువులకు గ్రూమింగ్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చు. ఇందులో పెట్ గ్రూమ్ టూల్, ఎక్స్‌టెన్షన్ హోస్ మరియు క్విక్ – రిలీజ్ అడాప్టర్ ఉన్నాయి. పెట్ గ్రూమ్ టూల్ అనేది పెంపుడు జంతువుకు ప్రశాంతంగా గ్రూమింగ్ చేసేలా తయారు చేశారు. గ్రూమింగ్ బ్రష్‌లో 364 స్లిక్కర్ బ్రష్‌లు ఉండగా, అవి 35-డిగ్రీల ఫ్లెక్స్‌లో మీరు బ్రష్ చేస్తున్నప్పుడు నిటారుగా ఉండేలా చేస్తుంది. ఇది వాక్యూమ్ స్విచ్ ఆన్ చేయకుండా ఉపయోగించవచ్చు మరియు జుట్టును పీల్చుకునేందుకు అనుగుణంగా పోస్ట్-గ్రూమింగ్ ఆన్ చేయవచ్చు.
డైసన్‌లో మైక్రోబయాలజీలో పరిశోధనా శాస్త్రవేత్త మోనికా స్టక్‌జెన్ ఇలా చెప్పారు:
‘‘పెంపుడు జంతువులు ఇంట్లో చూపే ప్రభావం మనం చూడగలిగే దాని కన్నా ఎక్కువగా ఉంటుంది. పెంపుడు జంతువుల వెంట్రుకలను సమర్థవంతంగా తొలగించడం చాలా ముఖ్యం. అయితే ఎండిన లాలాజలంతో పెంపుడు జంతువుల శరీరంపై ఉండే చుండ్రు కంటికి కనిపించని సమస్యగా ఉంటుంది. ఈ మైక్రోస్కోపిక్ కణాలు ఇంటి చుట్టూ అలర్జీని కలిగించే ప్రొటీన్‌లను మోసుకెళతాయి. అవి తేలికగా, చిన్నగా ఉండడంతో గంటల తరబడి గాలిలో ఉండవచ్చు లేదా వస్తువుల మధ్య బదిలీ చేయగలవు. పిల్లులు ఎప్పుడూ లేని గదులలో పిల్లి అలెర్జీ కారకాలు ఉంటాయని పరిశోధనలో గుర్తించాము. కనుక, డైసన్ మెషీన్‌లలో కనిపించే సరైన వడపోత అనేది పరిశుభ్రమైన ఇంటి- మొత్తం వాతావరణాన్ని నిర్వహించేందుకు చాలా ముఖ్యమైనది’’.
చాలా మంది పెంపుడు జంతువుల యజమానులకు, ముఖ్యంగా తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపే ప్రజలకు పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రును నిరంతరం శుభ్రం చేయడం అనేది అనేది రోజువారీ సమస్య. డైసన్ ఇంజనీర్లు ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయానికి వస్తే మెరుగ్గా శుభ్రపరిచే యంత్రాలను తయారు చేయడంలో శ్రద్ధ తీసుకున్నారు. పెంపుడు జంతువుల వెంట్రుకల వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు మరియు గేమ్-ఛేంజింగ్ పెట్ గ్రూమ్ టూల్‌ను పరిచయం చేసేందుకు వారు అసాధారణమైన శ్రమను తీసుకున్నారు. ఇది కంటికి కనిపించే పెంపుడు జంతువుల వెంట్రుకలను మాత్రమే కాకుండా పెంపుడు జంతువులు చిందించే కనిపించని చుండ్రు మరియు చనిపోయిన చర్మపు పొరలను కూడా సేకరించడంలో సహాయపడుతుంది.
పెంపుడు జంతువుల నుంచి మానవుల వరకు జుట్టు స్పెక్ట్రం
ఏదైనా పెంపుడు జంతువులను పెంచుకునే వారికి తెలిసినట్లుగా, విపరీతమైన షెడ్డింగ్ అనేది ఒక సంపూర్ణ గందరగోళం కాదు; చుండ్రు మరియు పుప్పొడి అలెర్జీలతో బాధపడేవారికి కూడా ఇది ఒక పీడకలగా ఉంటుంది. డైసన్ ఇంజనీర్లు, మైక్రోబయాలజిస్టులు పిల్లులు మరియు కుక్కలు వంటి అనేక రకాల జంతువులను అధ్యయనం చేశారు, అదే సమయంలో అల్పాకాస్, గాడిదలు, గుర్రాలు మరియు కుందేళ్ల వంటి ఊహించని జంతువులపైనా తమ అధ్యయనాన్ని కొనసాగించారు. సాంప్రదాయంతో కూడిన రిలయ్ – వరల్డ్ ఇంజనీరింగ్ పద్ధతులతో పాటు, అభివృద్ధి బృందం 284 విభిన్న హెయిర్ ఫైబర్ సిమ్యులేషన్‌లను రూపొందించేందుకు కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (CFD) సాఫ్ట్‌వేర్‌తో హై-స్పీడ్ కెమెరా ఫుటేజీని వినియోగించుకున్నారు. అధిక-వేగం ఉన్న గాలి ప్రవాహం, పరికరాల వర్చువల్ ప్రోటోటైప్‌లతో వివిధ పరిణామాల్లో ఉన్న పొడవు జుట్టు ఎలా ఇంటరాక్ట్ అవుతుందో ఇది ప్రతిబింబించేలా చేసింది. అవసరమైన భౌతిక నమూనాల సంఖ్యను తగ్గించేటప్పుడు వారి పరిశోధనను మెరుగుపరచుందకు వీలు కల్పించింది. ఈ పరిశోధన డైసన్ ఇంజనీర్‌లను బ్రష్ బార్‌ల కొలతలకు సరిపోయేలా హెయిర్ రిమూవల్ వ్యాన్‌లను కచ్చితంగా ఇంజనీర్ చేయడానికి వీలు కల్పించింది. అదే సమయంలో అన్ని రకాల జుట్టు రకాలలో డిటాంగ్లింగ్ పనితీరును కొనసాగించేలా చేసింది.
చిన్నగా మరియు కార్డ్‌లెస్‌గా ఉన్న కొత్త పెట్ గ్రూమ్ టూల్‌ను డైసన్ స్వాగతిస్తోంది.
పెంపుడు జంతువుల జుట్టు మీ ఇంటి ఆవరణలో పుప్పొడి మరియు ఇతర అలెర్జీ కారకాలను వ్యాప్తి చేస్తుంది. డైసన్ ఇటీవలి గ్లోబల్ డస్ట్ అధ్యయనం స్టడీ ప్రకారం, పెంపుడు జంతువుల యజమానులకు జుట్టు ఎక్కువగా ఉన్న తమ పెట్‌లు దాచి ఉంచిన వాటితో కలిగే ప్రభావాల గురించి తరచూ తెలుసుకోలేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శుభ్రపరిచే అలవాట్లను అధ్యయనం చేయడం ద్వారా ప్రతి ఇద్దరు (2) పెంపుడు జంతువుల యజమానులలో ఒకరు (1) పెంపుడు జంతువులను తమ పడకపై పడుకునుందకు అనుమతిస్తున్నారని డైసన్ వెల్లడించింది. అయినప్పటికీ, 30% పెంపుడు జంతువుల యజమానులు మాత్రమే తమ పెంపుడు జంతువులపై బాక్టీరియా మరియు నల్లుల మలం ఉంటుందని తెలుసు. భారతదేశంలో, కేవలం 36% భారతీయులు మాత్రమే పెంపుడు జంతువుల బుట్టలను సాధారణ శుభ్రపరుస్తూ ఉండగా, వీరిలో 10% మంది మాత్రమే తమ పెంపుడు జంతువుల బుట్టలను శుభ్రం చేసేందుకు వాక్యూమ్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నారు.
కొత్త డైసన్ పెట్ గ్రూమ్ టూల్, మీ కుక్కకు వదులుగా ఉండే వెంట్రుకలు, పెంపుడు చుండ్రు మరియు మైక్రోస్కోపిక్ స్కిన్ ఫ్లేక్‌లను తక్షణమే తొలగించేందుకు అనవుగా తయారు చేశారు. ఇప్పుడు వి8, వి11, వి12 డిటెక్ట్ స్లిమ్ మరియు వి15 డిటెక్ట్‌తో సహా డైసన్ తాజా శ్రేణి కార్డ్ లెస్ వాక్యూమ్ క్లీనర్‌లకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఇది యంత్రం లోని ప్రధాన బాడీకి లేదా పొడిగింపు గొట్టానికి కేవలం జోడించబడుతుంది. అలాగే 35° కోణంలో 364 ముళ్ల గరికెలను కలిగి ఉన్న ఈ సాధనం, మీరు మీ పెంపుడు జంతువును బ్రష్ చేస్తున్నప్పుడు వంగి ఉంటుంది. వేగవంతంగా మరియు సౌకర్యవంతమైన గ్రూమింగ్ కోసం వదులుగా ఉన్న వెంట్రుకలను పట్టుకునేందుకు ఇది అనువుగా ఉంటుంది.
శుభ్రపరిచే ప్రతి అవసరానికి అనుబంధం
డైసన్ ఇటీవలి గ్లోబల్ డస్ట్ అధ్యయనం ప్రకారం, 95% మంది ప్రజలు గత ఏడాలది కన్నా ఎక్కువ కాకపోయినా, ఒక మోస్తరు ఎక్కువ శుభ్రం చేస్తున్నారు. కానీ వాక్యూమ్ క్లీనర్లు మీ అంతస్తులు మరియు కార్పెట్లను మాత్రమే శుభ్రం చేసేందుకు మాత్రమే తయారు చేయలేదు. సరైన జోడింపులతో, మీ పరుపు నుంచి మీ పుస్తకాల అరల వరకు అన్నింటినీ శుభ్రం చేసేందుకు వాటిని ఉపయోగించవచ్చు. మీ మొత్తం ఇంటి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడేందుకు ఇది సహాయపడుతుంది. కానీ అన్ని వాక్యూమ్ క్లీనర్ అటాచ్‌మెంట్లు సమానమైన పని చేయవు. సమస్యను పరిష్కరించేందుకు డైసన్ వాక్యూమ్ క్లీనర్‌ల మాదిరిగానే డైసన్ పరికరాలు కచ్చితమైన ఇంజినీరింగ్‌తో అందుబాటులోకి వచ్చాయి.
అధునాతన డి-టాంగ్లింగ్ బ్రష్ బార్ టెక్నాలజీ
హెయిర్ స్క్రూ టూల్: బ్రష్ బార్‌పై వెంట్రుకలను తొలగించే సమస్యను కూడా డైసన్ ఇంజనీర్లు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. దీనికి విరుద్ధంగా క్లెయిమ్‌లు ఉన్నప్పటికీ, ఇది తరచుగా అనేక వాక్యూమ్‌లకు సవాలుగా ఉంటుంది, కనుక, మేము కొత్త యాంటీ-టాంగిల్ కోనికల్ బ్రష్ బార్‌ను అభివృద్ధి చేసాము. ఇది జుట్టును బయటకు మరియు బిన్‌లోకి మళ్లిస్తుంది. ఇది బ్రష్ బార్ చుట్టూ జుట్టు చుట్టుకోకుండా అడ్డుకుంటుంది. మానవ మరియు పెంపుడు జంతువుల వెంట్రుకల కోసం రూపొందించిన మా ఇంజనీరింగ్ టూల్‌లోని ముళ్ల గరికెల కచ్చితమైన కోణాన్ని సున్నితంగా సర్దుబాటు చేసారు. విడుదల శక్తి జుట్టును చిక్కుకోకుండా చూసేందుకు మరియు అనేక రకాల జుట్టు రకాలపై విడుదలకు ముందుగా ఈ పరికరాన్ని పరీక్షించారు.
హెయిర్ రిమూవల్ వ్యాన్‌లతో కూడిన కొత్త డిజిటల్ మోటర్‌బార్ క్లీనర్ హెడ్:
ఈ కొత్త బ్రష్ బార్ టెక్నాలజీ అన్ని మన పిల్లి జాతులు, కుక్కలు లేదా మానవ స్నేహితులు వదిలి వేసిన వెంట్రుకల నిర్వహణ కోసం తయారు చేశారు. డి-టాంగ్లింగ్ దువ్వెన నుంచి ప్రేరణ పొందిన బ్రష్ బార్‌లో 56 హెయిర్ రిమూవల్ వ్యాన్‌లు ఉన్నాయి. అన్ని రకాల జుట్టు రకాలను నేరుగా క్లీనర్ హెడ్‌లోకి తరలించడంలో సహాయపడటానికి కచ్చితమైన కోణాన్ని కలిగి ఉన్నాయి. ఈ పాలికార్బోనేట్ దంతాలు, స్పైరలింగ్ నైలాన్ బ్రిస్టల్స్, యాంటీ-స్టాటిక్ కార్బన్ ఫైబర్ ఫిలమెంట్స్ మరియు బలమైన చూషణ శక్తితో కలిపి, సమస్యాత్మకమైన చిక్కులను, అలాగే పెద్ద చెత్తను మరియు మైక్రోస్కోపిక్ ధూళిని సంగ్రహిస్తుంది మరియు పరిష్కరిస్తుంది.
డైసన్ పెంపుడు జంతువుల గ్రూమింగ్ పరికరం భారతీయ పెంపుడు జంతువుల యజమానులకు నిజమైన గేమ్ ఛేంజర్ మరియు ఇది కుక్కలు మరియు పిల్లుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. రెండు జాతులకు సీజన్ మరియు జాతిని బట్టి చాలా వెంట్రుకలను తొలగిస్తాయి, కాబట్టి మీ ఇంటిని నిరంతరం వాక్యూమ్ చేయడం మరియు రాలుతున్న జుట్టు మొత్తాన్ని తొలగించే బదులు, గ్రూమింగ్ సాధనం దాని మూలంలో సమస్యను పరిష్కరించేందుకు మిమ్మల్ని అనుమతించే ఉపయోగకరమైన అనుబంధం.
దీన్ని తయారు చేసిన నిపుణుల నుంచి నేరుగా కొనుగోలు చేయండి
డైసన్ కొత్త పెట్ గ్రూమింగ్ కిట్ దాని కార్డ్-ఫ్రీ వాక్యూమ్ క్లీనర్ 19 నవంబర్ 2022 నుంచి Dyson.inమరియు డైసన్ డెమో స్టోర్‌లలో రూ.9,900 ధరలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.