Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆండ్రోజెనిక్ అలోపెసియాగా పరిచయమైన స్త్రీ, పురుషులలో జుట్టు రాలడమనే సమస్య ఇప్పటికీ ఎంతోమందికి ఆందోళనకరమైన అంశం. మరీముఖ్యంగా 25 సంవత్సరాలకు పైబడిన వారిలో ఇది అతి ప్రధాన సమస్యగా పరిగణించబడుతుంది. నాన్ సర్జికల్ హెయిర్ రీగ్రోత్ చికిత్సలైనటువంటి ఓవర్ ద కౌంటర్ టాపికల్ మినోక్సిడిల్, ప్రిస్ర్కిప్షన్ ఓరల్ ఫినాస్టెరైడ్, ప్లాటెలెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్‌పీ) ఇంజెక్షన్లు మరియు లైట్ , లేజర్ థెరఫీ చికిత్సలు జుట్టు రాలు సమస్యలకు ఉపశమనం అందిస్తుంటాయి కానీ వీటి వల్ల దుష్పలితాలు కూడా ఎదురుకావొచ్చు. ఈ సమస్యలు లేకుండా అలోపెసియాలో జుట్టు రాలే సమస్యకు విప్లవాత్మక చికిత్సనందిస్తూనే జుట్టు రాలడం, జుట్టు ఎదగడం కోసం క్యుఆర్ 678 వచ్చింది.
ఈస్థటిక్ క్లీనిక్స్ ఫౌండర్లు మరియు విఖ్యాత కాస్మెటిక్ సర్జన్లు డాక్టర్ దేబరాజ్ షోమ్ మరియు డాక్టర్ రింకీ కపూర్‌లతో కూడిన బృందం ఈ క్యుఆర్ 678ను కనుగొంది. ఈ క్యుఆర్ 678తో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆలోపెసియాతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్సనూ అందిస్తుంది. ఈ క్యుఆర్ 678 ఫార్ములేషన్‌కు యుఎస్‌ఏ, ఇండియాలో పేటెంట్‌లు లభించాయి. వీరు ఇప్పటికే క్యుఆర్ 678 మరియు పీఆర్‌పీ చికిత్సలను సరిపోలుస్తూ అధ్యయనాలు చేశారు. పీఆర్‌పీ చికిత్సతో పోలిస్తే మూడు రెట్లు మెరుగైన ఫలితాలు క్యుఆర్ 678లో కనిపించాయి.
ఈస్థటిక్ క్లీనిక్స్ డైరెక్టర్, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ దేబ్‌రాజ్ షోమ్ మాట్లాడుతూ ‘‘ ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెయిర్ రీ గ్రోత్ చికిత్సలకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. క్యుఆర్ 678 ప్రక్రియలో వృద్ధి కారకాలను జుట్టు కుదుళ్లులో ఇంజెక్ట్ చేస్తారు. ఇది జుట్టు రాలడం ఆపి, జుట్టు ఎదిగేందుకు తోడ్పడుతుంది. క్యుఆర్ 678 నాన్ సర్జికల్ , నొప్పిలేని ప్రక్రియ. ఇప్పటికే లక్ష మందిలో చక్కటి ఫలితాలను అందించింది’’అని అన్నారు.