Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్‌లోని అమెజాన్ లెర్నింగ్ ఫ్లాట్‌ఫాంను మూసివేస్తున్నామని దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గురువారం ప్రకటించింది. ఎలాంటి కారణం చూపకుండానే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. కరోనా కాలంలో ఆన్‌లైన్ లెర్నింగ్‌కు డిమాండ్ పెరగడంతో గతేడాది ప్రారంభంలోనే ఈ వేదికను ప్రారంభించింది. జెఇఇ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది. కాగా.. ప్రస్తుత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దశల వారిగా దీనిని అమలు చేయనున్నట్లు పేర్కొంది.
కాగా ఇందులో ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్న విషయాన్ని ఆ సంస్థ వెల్లడించలేదు. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.