Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కొత్త సేవల ఆవిష్కరణ : ఆన్‌పాసివ్
హైదరాబాద్: దుబాయ్ కేంద్రం గా పని చేస్తున్న బిజినెస్ అటోమేషన్ సొల్యూషన్స్, ఇంటిలిజెన్సీ సేవలను అందించే ఆన్‌పాసివ్ తన హైదరా బాద్ కేంద్రాన్ని విస్తరించను న్నట్లు ప్రకటించింది. ఇక్కడి సెంటర్‌లో ప్రస్తుతం 500 పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని.. వచ్చే ఏడాది మార్చి ముగింపు నాటికి సిబ్బందిని 1000కి పైగా చేర్చనున్నట్లు ఆన్‌పాసివ్ చీఫ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సోహా ఇమామ్ తెలిపారు. గురువారం నగరంలోని ఆ సంస్థ కార్యాలయం లో ఆన్‌పాసివ్ డైరెక్టర్ వెంకట కిల్లి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహ్మాద్ కమల్‌తో కలిసి ఒ-నెట్, ఒ-మెయిల్, ఒ-కనెక్ట్ సేవలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సోహా మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా తమ మొదటి సెట్ విప్లవాత్మక పరిష్కారాలను అందిస్తాయన్నారు. భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికీ సమర్థవంతమైన, ప్రభావవంతమైన కమ్యూనికే షన్స్ కోసం ఈ మూడు సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. నూతన, ఆత్యాధునిక, అత్యంత అనుకూలమైన సాంకేతికతతో డిజిటల్ రంగానికి పునరాకతి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.