Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాదిపై మూడీస్ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది భారత వృద్థి రేటు మరింత పడిపోనుందని గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ విశ్లేషించింది. అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయ వాణిజ్య ప్రతికూల అంశాలు జిడిపికి ప్రధాన అడ్డంకిగా మారనున్నాయని పేర్కొంది. 2023లో దేశ వృద్థి రేటు 5 శాతానికే పరిమితం కానుందని మూడీస్ గత ఆగస్టు రిపోర్టులో అంచనా వేసింది. 2021లో జిడిపి 8.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా.. ప్రస్తుత ఏడాదిలో 8 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. భారత జిడిపి మరింత పడిపోవచ్చని తాజా 'అపాక్ అవుట్‌లుక్ : ఎ కమింగ్ డౌన్‌షిప్ట్' రిపోర్టులో పేర్కొనడం ఆందోళనకర అంశం. హెచ్చు ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బిఐ చేపడుతున్న వడ్డీ రేట్ల పెంపు వృద్థి రేటును దెబ్బతీస్తుందని మూడీస్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తగ్గడానికి చైనా బలహీనతలు ఒక్కటే కారణం కాదని తెలిపింది. ఆసియాలోని మరో కీలక దేశం భారత ఎగుమతులు ఒత్తిడిని ఎదుర్కోవడం కూడా ప్రతికూలమేనని పేర్కొంది. 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 6 శాతం మందగించనుందని.. 2022లో ఇది 3.2 శాతానికి.. 2023లో ఏకంగా 2.7 శాతానికి పరిమితం కానుందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసిన విషయం తెలిసిందే.