Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ జనాభాలో పొగత్రాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి ప్రధాన కారణంగా ఉండిపోతోంది, ముఖ్యంగా మగవారిలో ప్రభుత్వం ద్వారా చాలా అవగాహనా ప్రచారాలు చేపట్టబడినప్పటికినీ, కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గడచిన రెండు సంవత్సరాలలో భారతదేశం 1 మిలియన్ కన్నా ఎక్కువ కేసులను నమోదు చేసింది, మరియు ఈ రేట్ 2025 కల్లా ఏడింతలు పెరుగుతుందని అనుకుంటున్నారు. పెరుగుతున్న సంఘటనలు మరియు అలస్యమౌతున్న రోగ నిర్థారణ చాలా ఆందోళనకరంగా ఉంది. 75% కేసులలో, క్యాన్సర్ 3, 4 దశలఒ గుర్తించబడుతోంది, అప్పటికే క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి ఉంటోంది, ఇది అల్పమైన చికిత్సా ఫలితాలకు మరియు అధిక మరణ రేట్లకు దారి తీస్తోంది.
డా. విశ్వేష్వరన్, కన్సల్టెంట్ యశోదా హాస్పిటల్, హైద్రాబాద్, ప్రకరం,"ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్ని వయస్సుల మరియు లింగాల వారిని ప్రాభావితం చేసినా కూడా, పాసివ్ స్మోకింగ్, రేడియేషన్ థెరపీ, రాదొన్ లాంటి రేడియోయాక్టివ్ వాయువులకు సోకినప్పుడు, కెడియమ్ లాంటి భారీ లోహాలతో ప్రతిచర్య ఉన్నప్పుడు, మరియు కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండడం బ్వంటి ఇతర ఫాక్టర్స్ వల్ల కూడా రావచ్చు. ఈ వ్యాధి చికిత్సలో సాధారణంగా కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ కలిసి ఉంటాయి."
ప్రతి రోగికి సంరక్షణ ప్రణాళిక వేరుగాను, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. "ఊపిరితిత్తుల క్యాన్సర్ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎక్కువగా నివారించవచ్చు, ఎటువంటి వంటే:
పొగత్రాగడం ఆపేయడం:పొగత్రాగడం, యాక్టివ్ లేదా పాసివ్, ఊపితిత్తులలో మంటపుట్టిస్తుంది మరియు చిరాకు పెడుతుంది, ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ప్లమనరీ డిసీస్ (సిఓపిడి) లాంటి వ్యాధులు, ఇన్‌ఫెక్షన్స్ అపాయాన్ని పెంచుతుంది. ఒకవేళ కొనసాగిస్తే, ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని బాగుచేయడానికి కూడా లేకుండా నాశనం చేస్తుంది.
వాయు కాలుష్యానికి సోకడం తగ్గించాలి: పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకి అపాయంగా ఉన్న ఫాక్టర్ పరమాణుమయ కాలుష్యం. సన్నని పరమాణువులు ఈజిఎఫ్ఆర్ జీనిలో మార్పులను ప్రేరేపిస్తాయి, ఇది నాన్-స్మాల్-సెల్ లంగ్ కారినొమా-ఎన్ఎస్‌సిఎల్‌సి (ఊపిరితిత్తుల క్యన్సర్)కి జత చేయబడి ఉంది.
హానికరమైన రసాయనాల నుంచి దూరం ఉంచండి:కారినోజెనిసిస్‌ని ఎక్కువ చేసే, క్యాన్సర్ కారకమైన ఏ సబ్‌స్టెన్స్, రేడియోన్యుక్లైడ్, లేదా రేడియేషనైనా దూరంగా ఉంచండి. కారినోజెనిసిస్‌కి మామూలు ఉదాహరణలు మద్యం, ఇంజిన్ ఎక్సాస్ట్, పొగాకు, యువి కిరణాలు.
త్వరగా గుర్తించడం: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని నివారించడానికి ఇంకో ముఖ్యమైన భాగం త్వరగా గుర్తించడం. చాలా సంవత్సరాల పరిశోధన తరువాత, ఏ వ్యక్తులైతే క్రానిక్ స్మోకర్స్‌గా ఉన్నారో వారు తక్కువ-మోతాదులో ఛాతికి సిటి స్కాన్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం స్క్రీన్ చేయించుకోమని సిఫార్సు చేయబడింది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని ప్రారంభ దశలోనే గుర్తించడానికి సహాయపడుతుంది, మరియు దీనివల్ల చికిత్స విజయానికి అవకాశం పెరగవచ్చు. ఇప్పుడు ఉన్న అధునాతన ఈబియుఎస్ సిస్టమ్‌స్ గైడెడ్ బయోప్సిస్ వంటి బ్రొంకొస్కోపిక్ ఇంటర్‌వెన్షన్స్ లభ్యతతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని త్వరగా నిర్థారించడం ఇంకా చాలా సులభమైయింది," అన్నారు డా. విశ్వేస్వరన్.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరి ఆడకపోవడం, వాయునాళాలలో శ్రవించడం, తీవ్రమైన శ్రావం, మరియు బాధ, మరియు మరణం వంటి గంభీరమైన క్లేశాలకు దారి తీస్తుంది. బ్రతికి ఉండటానికి అవకాశాలి మెరుగుపరచుకోవాలంటే త్వరగా రోగ నిర్థారణ చేసుకోవడం మరియు సరైన చికిత్స కీలక ఫాక్టర్స్.