Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిశ్వర్ ఆటోరైడ్ ఎండి వెల్లడి
హైదరాబాద్: మహావీర్ గ్రూపు లో భాగమైన మల్టీ బ్రాండ్ సూపర్ బైకుల తయారీ, విక్రయాలను చేసే ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సం ముగింపు నాటికి 50 మోటో వాల్డ్ షోరూంలకు విస్తరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. శుక్రవారం హైదరాబాద్లో మూడు కొత్త బ్రాండ్లతో మోటో వాల్డ్ సూపర్ బైక్ షోరూంను ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా ఎండి వికాస్ జబఖ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అంతర్జాతీయ బ్రాండ్లు మోటో మోరిని, జోన్ల, క్యూజె మోటర్లోని పలు మోడళ్లను ఆవిష్కరించారు. ప్రస్తుతం తమకు పలు నగరాల్లో తొమ్మిది అవుట్లెట్లు ఉన్నాయని వికాస్ మీడియాకు తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లిలో అసెంబ్లింగ్ యూనిట్ ఉందన్నారు. ఈ ప్లాంట్ కోసం రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టామన్నారు. ఇక్కడ ప్రస్తుతం 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. తమ సూపర్ బైకు అమ్మకాల్లో 20 శాతం వృద్థిని నమోదు చేస్తున్నామన్నారు. ఈ రంగంలో విస్తృతావకాశాలున్నాయన్నారు.