Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముంబయి కేంద్రంగా పని చేస్తున్న జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తమ క్లినిక్‌ను హైదరాబాద్‌లో తెరుస్తున్నట్లు ప్రకటించింది. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్లోక్ హాస్పిటల్ ఫంక్షనల్ న్యూరోసర్జరీ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ పరేష్ దోషి మాట్లాడుతూ.. ఫంక్షనల్ న్యూరో సర్జరీ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఫంక్షనల్ న్యూరోసర్జరీ, డిఎ బ్రెయిన్ స్టిమ్యులేషన్‌లో అపారమైన అనుభవం కలిగిన జస్లోక్ హాస్పిటల్ మెరుగైన చికిత్సనందించే రీతిలో కొండాపూర్‌లో తమ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో జస్లోక్ హాస్పిటల్ సిఇఒ జితేంద్ర హర్యన్, సియా లైఫ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ స్వాతి ప్రత్తిపాటి, ఫంక్షనల్ న్యూరో సర్జన్ కన్సల్టెంట్ మనీష్ బల్దియా పాల్గొన్నారు. ఈ ఫంక్షనల్ న్యూరాలజీ క్లీనిక్ నగరవాసులకు మెరుగైన సేవలను అందించడంతో పాటుగా వారికి తగిన సౌకర్యమూ అందిస్తుందని మనీష్ పేర్కొన్నారు.