Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెం బర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ప్రయి వేటు లిమిటెడ్ రూ.333 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఇంత క్రితం త్రైమాసికంలో ఈ సంస్థ రూ.414 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో సంస్థ రెవెన్యూ 24 శాతం పెరిగి రూ.2,905 కోట్లుగా నమోదయ్యిందని తెలిపింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ కోసం గతేడాది అక్టోబర్‌లో ఈ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. వరుస నష్టాలను చవి చూస్తున్న ఈ సంస్థ ఐపిఒకు వస్తే ఏ మేరకు స్టాక్ మార్కెట్లలో రాణిస్తోందో వేచి చూడాలి.