Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదు
ముంబయి: స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రముఖ డిజిటల్ చెల్లింపులు వేదిక పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్‌కు రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇచ్చింది. పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) సేవలు అందించేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు మంజూ రయ్యే వరకు కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదని స్పష్టం చేసింది. వివిధ పద్ధతుల ద్వారా ఈ-కామర్స్, వ్యాపారులకు వినియోగదారులు చెల్లింపులు చేస్తుంటారు. దీనికి పేటియం లాంటి డిజిటల్ చెల్లింపుల వేదికలు మధ్య వర్తులుగా వ్యవహారిస్తున్నాయి. కాగా.. ఆర్‌బీఐ నిర్ణయం తమ వ్యాపారం పై ఎలాంటి ప్రభావం చూపబోదని పేటియం పేర్కొంది. త్వరలోనే సంబంధిత అనుమతులు పొందుతామని విశ్వాసం వ్యక్తం చేసింది.