Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• యూరోప్‌లో రూపకల్పన, మహన్సారియా గ్రూప్‌కు చెందిన విభాగం రీస్ మోటో చేత భారతదేశంలో అభివృద్ధి చేయబడింది; రైడింగ్ కమ్యూనిటీ అవసరాలను తీర్చనుంది.
• భారతీయ రోడ్ల కోసం ప్రపంచశ్రేణి పనితీరు కలిగిన టైర్లు, భారతదేశంలో రైడింగ్ కమ్యూనిటీ అవసరాలను తీర్చే క్రమంలో ప్రీమియం ద్విచక్రవాహన టైర్ల అవసరాలను రీస్మోటో తీర్చనుంది.
• మహన్సారి గ్రూప్ మరియు యూరోపియన్ బ్రాండ్ మిటాస్ల ఉమ్మడి సంస్థ రీస్ మోటో
• గుజరాత్‌లోని సేఖా వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక కేంద్రంలో యూరోపియన్ ప్రమాణాలతో రీస్ టైర్లను తయారుచేయనున్నారు.
• ఆఫ్‌రోడ్, ఆన్‌రోడ్ అవసరాలకనుగుణంగా విస్తృతశ్రేణిలో వినియోగదారుల అవసరాలను తీర్చనుంది.
నవతెలంగాణ ముంబై: ఆటోమోటివ్ రంగంలో సుప్రసిద్ధమైన మహన్సారి గ్రూప్ విభాగం రీస్ మోటో తమ ప్రీమియం ద్వి చక్రవాహన టైర్ బ్రాండ్ రీస్ (Reise)ను భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ నాణ్యత కలిగిన టైర్లను భారతీయ రోడ్లకు అనుగుణంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయనున్నారు.
రీస్ మోటో ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ మహన్సారియా మాట్లాడుతూ ‘‘అత్యంత శక్తివంతమైన భారతీయ ద్విచక్రవాహన విభాగంలో మారుతున్న అవసరాలు, ఔత్సాహికుల కోరికలను తీర్చడం అత్యంత కీలకం. భారతీయ రోడ్ల కోసం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన టైర్లను అందించాలనే ప్రయత్నాల ఫలితం రీస్ మోటో టైర్లు’’ అని అన్నారు.
రీస్ బ్రాండ్ కింద రీస్ మోటో మొదటి దశలో 26 ఎస్‌కెయులను ఆరు ఉప బ్రాండ్లు–ట్రైల్ ఆర్, టూర్ ఆర్,ట్రేస్ ఆర్, ట్రూప్ ఆర్ కింద మోటర్‌సైకిల్స్ విభాగంలో మరియు ట్రిప్ ఆర్ మరియు ట్విస్ట్ ఆర్ అంటూ స్కూటర్ల విభాగంలో అందిస్తుంది.
ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను ఇండియా తయారుచేస్తుంది. రీస్ మోటో తమ విస్తృత శ్రేణితో ద్విచక్రవాహన టైర్ మార్కెట్లో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలువనుందని మహన్సారియా అన్నారు.
రీస్ మోటో కోసం మహన్సారియా గ్రూప్, యూరోప్‌కు చెందిన మిటాస్తో 76:24 రేషియో భాగస్వామ్యం చేసుకుంది. ట్రెల్లెబోర్గ్ వీల్స్ సిస్టమ్స్ అధ్యక్షులు పావ్లో పోంపెల్ మాట్లాడుతూ ఈ రెండు కంపెనీల భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేశారు