Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: సుప్రసిద్ధ లగ్జరీ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ కల్కి ఫ్యాషన్ తమ ట్రేడ్‌మార్క్‌లను అక్రమంగా వినియోగిస్తుందంటూ సూరత్‌కు చెందిన కల్కి ట్రెండ్జ్‌పై బాంబే హైకోర్టులో దాఖలు చేసిన దావాలో విజయం సాధించింది. వినోద, ఫ్యాషన్ ప్రపంచంలో గత 15 సంవత్సరాలుగా కార్యకలాపాలను కల్కి ఫ్యాషన్ నిర్వహిస్తూ ఫ్యాషన్ అభిమానుల నడుమ ఖ్యాతి గడించింది. సూరత్‌కు చెందిన కల్కిట్రెండ్జ్ తమ బ్రాండ్ నేమ్ మాత్రమే కాపీ చేయడం కాకుండా అదే పేరుతో మార్కెటింగ్, విక్రయాలను జరుపుతుందని గుర్తించి చట్టపరమైన చర్యల కోసం కల్కి ఫ్యాషన్స్ కోర్టును ఆశ్రయించింది. కల్కి ఫ్యాషన్ తరపున ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న నమ్రత పాహ్వ వాదించగా మధ్యంతర ఉత్తర్వ్యులను జస్టిస్ చాగ్లా జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అనుసరించి కల్కి ట్రెండ్జ్ తమ ఐపీ రిజిస్ట్రీ సహా అన్ని చోట్లా ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లను ఉపసంహరించుకోవడానికి అంగీకరించింది.
ఈ సందర్భంగా కల్కి ఫ్యాషన్ డైరెక్టర్ నిషిత్ గుప్తా మాట్లాడుతూ ‘‘ మా బ్రాండ్పేరును అక్రమంగా వినియోగించుకుంటున్న మోసపూరిత సంస్థలపై విజయం సాధించడం సంతోషంగా ఉంది. పట్టుదల, కృషితో మేము ఫ్యాషన్ ప్రపంచంలో మా బ్రాండ్‌కు ఓ గుర్తింపు తీసుకువచ్చాము. కాపీరైట్స్, డిజైన్స్, పైరసీ ఉల్లంఘనల పట్ల అన్ని కంపెనీలూ తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఎవరు మా బ్రాండ్ పేరు వినియోగించినా సహించము. మా వినూత్నమైన, ప్రీమియం బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందించడం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.