Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: శ్రీ అఖిలేష్ చిట్లాంగియా రచించిన స్మార్ట్ ప్లైఉడ్ బైయింగ్ గైడ్, తమ ఇల్లు లేదా ఆఫీస్‌లో ఇంటీరియర్స్ చేయించుకునే ముందు తప్పనిసరిగా చూడాల్సిన పుస్తకంగా నిలుస్తుంది. ఇంటి ఇంటీరియర్స్‌లో ప్లైఉడ్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. తమ ఇంటీరియర్స్‌లో ప్లై ఉడ్ కొనేవేళ అధిక సమయం భారతీయులు శోధించాలని చిట్లాంగియా అన్నారు. ఆయనే మాట్లాడుతూ మీరు అధిక సమయం మీ కుటుంబ సభ్యులతో గడపడం కంటే ఈ శోధనకు వెచ్చించాలి. తద్వారా దాని గురించి మరింత లోతుగా తెలుసుకోగలరన్నారు. బోస్టన్ యూనివర్శిటీలో విద్యను పూర్తిచేసిన అఖిలేష్ ఆ తరువాత తమ ఫ్యామిలీ ప్లైఉడ్ వ్యాపారంలో ప్రవేశించారు. అప్పుడే ఆయన కోట్ల రూపాయలను ఇంటి కోసం ఖర్చు చేస్తున్న వారు కూడా ఇంటీరియర్స్‌లో వినియోగించే ప్లై ఉడ్ పట్ల అసలు సమయం వెచ్చించడం లేదని గుర్తించారు. మీ ఇంటీరియర్ ఖర్చులో కేవలం 1% అధికంగా మాత్రమే బ్రాండెడ్ ఇంటీరియర్ ఖర్చు పెరుగుతుందని, అందువల్ల మీరు సరైన ప్లైఉడ్ కొనుగోలు చేయాలని అఖిలేష్ చిట్లాంగియా అన్నారు.
ఇంగ్లీష్, హిందీ భాషల్లో అతి సరళంగా రచించిన ఈ పుస్తకంలో అతి లోతైన పరిజ్ఞానం అందించారు. ప్లై ఉడ్ ఎంపికలో చేసే చిన్న పొరపాటు కూడా డబ్బు, సమయం, మనశ్శాంతిని పొగొడుతుందన్నారు.
హిందీలో పుస్తకం విడుదల చేయడం గురించి డ్యూరోప్లై డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అఖిలేష్ చిట్లాంగియా మాట్లాడుతూ ‘‘ తమ ఇంటీరియర్స్ కోసం సరైన ప్లై ఉడ్ ఎంపిక పట్ల భారతీయులు దృష్టి సారించాలన్నది నా లక్ష్యం. ఈ కారణం చేతనే పరిశ్రమ పరిజ్ఞానం అంతా ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేశాను. మా వినియోగదారులు ప్లై ఉడ్ కొనుగోలు పట్ల తగిన శ్రద్ధ చూపగలరని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో లభ్యమవుతుంది. ఈ పుస్తకాన్ని పరిమిత కాలం పాటు ఉచితంగా హిందీ, ఆంగ్ల భాషలలో http://plywoodguide.com/ వద్ద డౌన్లోడ్ చేసుకోవచ్చు.