Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యయనంలో పాల్గొన్న భారతీయులలో అత్యధిక శాతం మందికి హాలీడేలను వేడుక చేయడానికి అత్యున్నత వినియోగ విభాగంగా నిలిచిన ట్రావెల్
- 87% మంది భారతీయ స్పందనదారులు చిరు వ్యాపారుల వద్ద తమ కొనుగోళ్లుజరపాలని కోరుకుంటున్నారు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్ధకు మద్దతు అందించాలనుకుంటున్నారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఇదే అత్యధికం
- హాలీడే సీజన్లో ఆలోచనాత్మకమైన, సస్టెయినబల్ బహుమతులను కొనుగోలు చేయాలని అధికశాతం భారతీయులు కోరుకుంటున్నారు
- 88% మంది భారతీయ స్పందనదారులు ఈ హాలీడే సీజన్లో చేసే కొనుగోళ్లకు క్రెడిట్ కార్డ్ రివార్డులు కోరుకుంటున్నారు
హైదరాబాద్: ఈ హాలీడే సీజన్లో కుటుంబంతో కలిసి ఆస్వాదించాలని కోరుకుంటున్న భారతీయులు (82%) లో అధిక శాతం మంది (88%)మంది ఆలోచనాత్మకంగా ట్రావెల్‌పై ఖర్చు చేయాలనుకుంటున్నారని అమెక్స్ ట్రెండెక్స్ వెల్లడించింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసిన ట్రెండ్ రిపోర్ట్ ఇది. ప్రియమైన వారితో నాణ్యమైన సమయం గడపాలని ప్రతి 10 మందిలో 8 మంది (87%) కోరుకుంటున్నారు. కుటుంబంతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు ఎన్నో మధురస్మృతులను తాము పొందామని వీరు చెబుతున్నారు. అదే సమయంలో ప్రతి 10మందిలో ఆరుగురు తాము చిరు వ్యాపారుల వద్దనే అధికంగా ఖర్చు చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్ ఇండియా సీఈఓ సంజయ్ ఖన్నా మాట్లాడుతూ ‘‘ ఈ హాలీడే సీజన్లో భారతీయ వినియోగదారులు ఖర్చు చేసే విధానంలో ప్రధానంగా రెండు మార్పులను గమనించాము. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చేసే యాత్రలతో మధురస్మతులను పొందాలనుకోవడం ఒకటైతే, మరోటి ఆలోచనాత్మక బహుమతులు అంటే సస్టెయినబల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకోవడం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా స్ధానిక వ్యాపారాలకు మద్దతు అందించడం పెరిగింది’’ అని అన్నారు. ‘‘తమ అమెక్స్ ట్రెండ్ నివేదిక వెల్లడించే దాని ప్రకారం ఆఫ్‌లైన్ ఈవెంట్లు జోరుగా జరుగుతుండటంతో 62%మంది స్పందనదారులు సంగీత పండుగలకు వెళ్లాలనుకుంటున్నారు. అదే సమయంలో 56% మంది స్పోర్టింగ్ కార్యక్రమాలకు హాజరుకావాలనుకుంటున్నారు. యాత్రలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే జరుగుతుండటంతో భారతీయులలో అధిక శాతం మంది విదేశీ యాత్రలు కూడా చేయాలనుకుంటున్నారు’’ అని అన్నారు.